తిరుపతి సభలో పవన్‌ స్పీచ్‌ చూస్తుంటె కెవ్వు కేక పాట గుర్తొచ్చింది : భూమన కరుణాకర్‌ రెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కల్లు తాగిన కోతిలా కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు.

Advertisement
Update:2024-10-03 21:07 IST

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను చూస్తుండే గబ్బర్ సింగ్‌ సినిమాలో కెవ్వుకేక పాట గుర్తుకు వస్తుందని వైసీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతి వారాహి బహిరంగ సభలో పవన్ సనాతన డిక్లరేషన్‌పై ఆయన మాట్లాడుతూ ఇక్కడ తిరుమల్లో రాజకీయాలు మాట్లడనని చెప్పిన పవన్ వైసీపీ అధినేత జగన్ మీద ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారని అత్యుత్తన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు హెచ్చరికలు జారీ చేశారని భూమన తెలిపారు. సనాతన ధర్మం ఆయనే కాపాడుతున్నట్లుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.14 ఏళ్లుగా తన కుమార్తెలను దైవ దర్శనానికి తీసుకురాని వ్యక్తి పవన్. సనాతన ధర్మ ఆచారకులు పిల్లలకు 9 నెలలకే తల నీలాలు తీయిస్తారు.

అలా చేయని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు. ఆయన డిక్లరేషన్‌పై సంతకం చేస్తూ తిరుమలలో కనిపించారు. పవన్ సనాతన ధర్మం ప్రకారం బాప్టిజం తీసుకున్నా పర్వాలేదు. తిరుమల ప్రసాదంలో పశువుల కొవ్వు వాడారు అన్నారు. పవన్ క్షుద్ర రాజకీయ నాయకుడు. మతం ముసుగులో నాటకం ఆడాలనుకుంటున్నాడు. హైందవ సంస్కృతికి చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. నేను మళ్లీ పవన్‌కి ఛాలెంజ్ చేస్తున్నాను. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా సిద్ధం. శ్రీవాణి ట్రస్టుపై చేసిన ఆరోపణలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పు. శ్రీవాణి ట్రస్టులో ఒక్క రూపాయి దుర్వినియోగం అయినా ఏ శిక్షకైనా సిద్ధమని భూమన కరుణాకర్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు

Tags:    
Advertisement

Similar News