లైన్ క్లియర్.. వైసీపీలోకి ముద్రగడ
ముద్రగడ ఫ్యామిలీ నుంచి ఒకరిని వైసీపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేయిస్తారని సమాచారం. ఇప్పటికే పిఠాపురం ఇన్‌ఛార్జిగా ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీతను సీఎంవోకు పిలిపించి ఇదే అంశంపై వైసీపీ హైకమాండ్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మొన్నటివరకు జనసేనకు అనుకూలంగా కనిపించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, పవన్‌కల్యాణ్ తీరుతో రూటు మార్చారు. వైసీపీలో చేరేందుకు ముద్రగడ ఫ్యామిలీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బేషరతుగా వైసీపీలో చేరేందుకు ముద్రగడ ఫ్యామిలీ అంగీకరించినట్లు సమాచారం. ఎలాంటి సీట్లు, పదవులు ఆశించకుండానే ముద్రగడ ఫ్యామిలీ వైసీపీలో చేరబోతుందని తెలుస్తోంది.
అయితే ముద్రగడ ఫ్యామిలీ నుంచి ఒకరిని వైసీపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేయిస్తారని సమాచారం. ఇప్పటికే పిఠాపురం ఇన్‌ఛార్జిగా ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీతను సీఎంవోకు పిలిపించి ఇదే అంశంపై వైసీపీ హైకమాండ్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చల అనంతరం ముద్రగడ ఫ్యామిలీ వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
మొన్నటివరకు ముద్రగడ జనసేనలో చేరాలనుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు, సీట్ల పంపకాలతో పాటు జనసేనాని పవన్‌కల్యాణ్ తీరుతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ముద్రగడ. పార్టీలోకి ఆహ్వానించేందుకు ఇంటికి వస్తానని పలుమార్లు చెప్పిన జనసేనాని రాకపోవడంతో.. ముద్రగడ అవమానంగా భావించారు. ఇదే విషయమై ఇటీవల పవన్‌కు ఘాటుగా లేఖ సైతం రాశారు.