ప్రార్థనకు ప్రతిఫలం.. రాత్రి 11కే బెయిల్‌ వస్తుందని చెప్పా..

కోర్టు చెప్పినట్టుగానే ప్రతి శనివారం అవినాష్ రెడ్డి విచారణకు వెళ్తారని.. హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి నేరుగా తనతోనే చెప్పారని పాల్ వివరించారు.

Advertisement
Update:2023-05-31 16:55 IST

ప్రార్థనకు ప్రతిఫలం.. రాత్రి 11కే బెయిల్‌ వస్తుందని చెప్పా..

వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రావడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హర్షం వ్యక్తం చేశారు. అవినాష్‌ రెడ్డికి కండిషనల్ బెయిల్‌ వస్తుందని రాత్రి 11 గంటలకే తాను సోషల్ మీడియాలో ప్రకటించానని గుర్తు చేశారు.


ప్రార్థించగా దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చారన్నారు. విచారణకు అవినాష్ రెడ్డి రావడం లేదని సీబీఐ అబద్దం చెబుతోందన్నారు. ఏడు సార్లు విచారణకు వచ్చారని.. కేవలం తల్లి అనారోగ్యం కారణంగా ఒకసారి వెళ్లకపోతే దాన్ని చంద్రబాబు అండ్ టీం రకరకాలుగా ప్రచారం చేయించిందన్నారు.

కోర్టుల్లో చంద్రబాబు ఆటలు ఇక చెల్లవన్నారు. హైకోర్టు చాలా మంచి తీర్పును ఇచ్చిందన్నారు. కోర్టు చెప్పినట్టుగానే ప్రతి శనివారం అవినాష్ రెడ్డి విచారణకు వెళ్తారని.. హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి నేరుగా తనతోనే చెప్పారని పాల్ వివరించారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడిని, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని విచారించాలని డిమాండ్ చేశారు.


రెండో భార్యకు రూ.8 కోట్లు ఇస్తున్నారని తెలిసిన తర్వాతే వివేకా హత్య జరిగిందని ఆ దిశగానూ దర్యాప్తు చేయాలన్నారు. ఈ కోణాల్లో సీబీఐ దర్యాప్తు చేయకపోతే తాను కోర్టులో పిటిషన్‌ వేస్తానన్నారు. వివేకానందరెడ్డిని చంపిన నీచుల పేర్లను బయటపెట్టాలన్నారు.

సీబీఐ రాష్ట్రంలోని రాకూడదని జీవోలు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అప్పుడు సీబీఐ వద్దన్న చంద్రబాబు ఇప్పుడు సీబీఐని వాడుకుంటున్నారని పాల్‌ ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News