అమెరికాలో అయితే చంద్రబాబుని 15ఏళ్లు జైల్లో పెట్టేవారు..

పోలీసులు, చంద్రబాబు సభలకు అనుమతులు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. సభకోసం 10వేలమందికి అనుమతి తీసుకుని 40వేలమందిని తరలించారని, అందుకే తొక్కిసలాట జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2023-01-02 12:06 IST

చంద్రబాబుని విమర్శించడంలో వైసీపీ నేతల కంటే ఎక్కువ దూకుడుగా ఉన్నారు కేఏపాల్. కందుకూరు ఘటనపై వైసీపీ నేతలెవరూ పరామర్శలకు వెళ్లకముందే ఆయన నేరుగా అక్కడికి వచ్చేశారు. హడావిడి చేశారు. చంద్రబాబుపై కేసు పెట్టాలన్నారు. తాజాగా గుంటూరు ఘటన తర్వాత కూడా ఆయన లైన్లోకి వచ్చారు. చంద్రబాబే ఆ దుర్ఘటనకు కారణం అని, అమెరికాలో అయితే చంద్రబాబుకి 15ఏళ్లు జైలుశిక్ష పడేదన్నారు. ఇక్కడ కాబట్టి ఆయన బతికిపోయారని చెప్పారు.

అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. అయినా మారలేదు..

చంద్రబాబూ మాకు ఇదేం ఖర్మ..? అని ప్రశ్నించారు కేఏపాల్. కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడే చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చానని, కానీ ఆయన ఒక్క శాతం కూడా మారలేదని మండిపడ్డారు. అసలు డీజీపీకి బుద్ది ఉండొద్దా…? అంటూ ఫైరయ్యారు. పోలీసులు చంద్రబాబు సభలకు అనుమతులు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. సభకోసం 10వేలమందికి అనుమతి తీసుకుని 40వేలమందిని తరలించారని, అందుకే తొక్కిసలాట జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇప్పటికైనా బుద్ది రావాలని అన్నారు పాల్.

తమ్ముడు పవన్.. ఎక్కడికెళ్లిపోయావ్..?

గుంటూరులో తొక్కిసలాట జరిగితే తమ్ముడు పవన్ ఎక్కడికెళ్లిపోయారని ప్రశ్నించారు కేఏపాల్. ప్రజల ప్రాణాలు పోతున్నా స్పందించని పవన్ కల్యాణ్ కి రాజకీయాలెందుకని ప్రశ్నించారు. సినిమాలే చేసుకోవాలని హితవు పలికారు. తాను తప్ప ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరని తెలిపారు కేఏ పాల్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాకి కూడా తాను అప్పులు ఇప్పిచ్చాననని చెప్పుకొచ్చారు పాల్.

Tags:    
Advertisement

Similar News