జగన్ నాయకత్వం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. - జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్
సీఎం జగన్ వంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉండటం వల్ల కలిగే ప్రయోజనమేంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు. జగన్ నాయకత్వం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో బుధవారం నిర్వహించిన స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌తో కలసి ఆయన పాల్గొన్నారు.
ఈ స్టీల్ ప్లాంట్ కడప ప్రజల చిరకాల స్వప్నమని, జగన్ కృషి, పట్టుదల కారణంగానే ఈ కల సాకారమవుతోందని ఆయన చెప్పారు. విజయవాడలో సీఎంతో కలిసి లంచ్ చేసినప్పుడు రాష్ట్రం గురించి చాలా మాట్లాడుకున్నామని జిందాల్ చెప్పారు. వైద్య ఆరోగ్య రంగం నుంచి డిజిటలైజేషన్ వరకు జగన్ చెప్పిన మాటలు నాకు దేవుడి మాటల్లా అనిపించాయి అంటూ ఆయన తెలిపారు.
సీఎం జగన్ వంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉండటం వల్ల కలిగే ప్రయోజనమేంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఆయన చెప్పారు.