వైజాగ్ తో మొదలు పెట్టిన పవన్..
వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. గతంలో కూడా ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పానని గుర్తు చేశారు.
డిప్యూటీ సీఎంగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత చేరికల ఘట్టం విశాఖతో మొదలు కావడం సంతోషంగా ఉందన్నారు పవన్ కల్యాణ్. విశాఖపట్నం కార్పొరేషన్ కి సంబంధించి ఐదుగురు కార్పొరేటర్లను ఆయన జనసేనలోకి ఆహ్వానించారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి జనసేన అధిక స్థానాలు గెలుచుకుంటుందని పవన్ ఆశాభావం వ్యక్తంచేశారు. పార్టీలో చేరిన వాదంరదికీ బలాన్నిచ్చి ఎదిగే వాతావరణాన్ని జనసేన కలిగిస్తుందని భరోసా ఇచ్చారు.
వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. గతంలో కూడా ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పానని గుర్తు చేశారు. ఒక్కోసారి నేతలు మాట్లాడే విధానం, వారిని నమ్ముకున్నవారికి నష్టం కలిగిస్తుందన్నారు. విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి విజయానికి నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చేరికలతో జనసేన మరింత బలపడుతోందన్నారు పవన్.
కొత్తగా పార్టీలో చేరిన నేతలు, పాతవారితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు పవన్ కల్యాణ్. విశాఖలో కాలుష్యం ఎక్కువగా ఉందని, దాన్ని నివారించేందుకు స్థానిక నేతలంతా బాధ్యతతో పనిచేయాలన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్.