గ్లాసుకోసం పోరాటం వృథా.. జనసేనకు ఈసీ షాక్

కోర్టుకి ఈసీ ఇచ్చిన వివరణ చూస్తే జనసేనకు షాక్ తప్పదని తేలిపోయింది. అంటే ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని ని గాజు గ్లాస్ బాగా ఇబ్బంది పెట్టబోతోందనమాట.

Advertisement
Update:2024-05-01 13:35 IST

గాజు గ్లాసు విషయంలో హైకోర్టులో జనసేనకు చుక్కెదురైంది. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించడం సరికాదంటూ కోర్టుకెక్కింది జనసేన పార్టీ. దీనిపై ఎన్నికల కమిషన్ ను వివరణ కోరింది కోర్టు. సరైన లాజిక్ తో ఈసీ వివరణ ఇచ్చింది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అని, ఇతరులకు దాన్ని కేటాయించొద్దని కోరడం సరికాదని చెప్పింది.

ఏపీలో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న లోక్ సభ సీట్లకు బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాసు గుర్తు ఇవ్వలేదు. అదే సమయంలో జనసేన 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తోంది. ఆ 2 లోక్ సభ స్థానాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాల్లో కూడా స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు ఇవ్వలేదు. ఇదే విషయాన్ని ఈసీ కోర్టుకి స్పష్టం చేసింది. అంతకు మించి గాజు గ్లాసు గుర్తు విషయంలో చేయడానికేం లేదని తేల్చేసింది.

జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఏనాడూ పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ఏదో ఒక సాకుతో ఎన్నికల్లో పోటీ చేసేవారు కాదు. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ గాజు గ్లాసు విషయంలో రచ్చ జరిగేది. ఈసీని బతిమిలాడుకోవడం, గుర్తు పోకుండా ఉండేందుకు ప్రయత్నించడం.. ఇలా జరుగుతోంది తంతు. ఈసారి జనసేన ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నా అక్కడ జరగాల్సిందే జరిగింది. గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ఈసీ పేర్కొంది. చివరకు నామినేషన్లు పూర్తయి, గుర్తులు కేటాయించే సమయానికి జనసేన రచ్చ చేస్తోంది. గాజు గ్లాసు ఇంకెవరికీ ఇవ్వడానికి వీల్లేదంటూ కోర్టు మెట్లెక్కింది. కోర్టుకి ఈసీ ఇచ్చిన వివరణ చూస్తే జనసేనకు షాక్ తప్పదని తేలిపోయింది. అంటే ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని ని గాజు గ్లాస్ బాగా ఇబ్బంది పెట్టబోతోందనమాట. 

Tags:    
Advertisement

Similar News