నారా లోకేష్ శంఖారావం సభలకు జనసైనికులు డుమ్మా
టీడీపీతో తమ పార్టీ పొత్తుపై ముఖ్యంగా విశాఖపట్నం జనసేన కార్పోరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించే స్థితిలో లేరు.
టీడీపీ, జనసేన మధ్య సయోధ్య అద్భుతంగా కుదురుతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. కానీ, అది సులభం కాదని అర్థమవుతోంది. నారా లోకేష్ శంఖారావం సభలకు జనసేన కార్యకర్తలు డుమ్మా కొడుతున్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన శంఖారావం సభలకు జనసేన కార్యకర్తలు పెద్దగా హాజరు కాలేదు. పార్టీ బలం పెంచుకోవడానికి ఉన్న అవకాశాన్ని పొత్తు ద్వారా పవన్ కల్యాణ్ జారవిడుచుకుంటున్నారనే అభిప్రాయం జనసేన కార్యకర్తల్లో ఉంది.
టీడీపీతో తమ పార్టీ పొత్తుపై ముఖ్యంగా విశాఖపట్నం జనసేన కార్పోరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించే స్థితిలో లేరు. కానీ, టీడీపీ సమావేశాలకు మాత్రం వారు పెద్దగా హాజరు కావడం లేదు. విశాఖ శంఖారావం సభకు ఎక్కువ మంది దూరంగా ఉండవచ్చు.
నారా లోకేష్ శ్రీకాకుళం, విజయనగరం శంఖారావం సభలకు జనసేన కార్యకర్తలు అతి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. ఈ స్థితిలో టీడీపీ, జనసేన మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం కుదురుతుందనే నమ్మకం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.