పవన్ ఆ మాట చెప్పేస్తే సరి!
ఈ విడత యాత్రలో అయినా ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని పవన్ ప్రకటించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఫలానా చోట నుంచి పోటీ చేస్తానని ఒక్క మాట చెబితే చాలు తాము రంగంలోకి దిగి అధినేతను రికార్డ్ స్థాయిలో గెలిపించుకోవడం కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెడతామని చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రెండో విడత వారాహి యాత్రకు ముహూర్తం నిర్ణయించారు. గత యాత్ర మాదిరిగా గోదావరి జిల్లాలో ఇంతకు ముందు పర్యటించని నియోజకవర్గాలలో బహిరంగ సభలు, రాజకీయ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. దీంతో ఈ విడత యాత్రలో అయినా ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని పవన్ ప్రకటించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఫలానా చోట నుంచి పోటీ చేస్తానని ఒక్క మాట చెబితే చాలు తాము రంగంలోకి దిగి అధినేతను రికార్డ్ స్థాయిలో గెలిపించుకోవడం కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెడతామని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల తమ అధినేత ఓటమిపాలవ్వడాని జీర్ణించుకోలేని జనసైనికులు ఈసారి ముందుగా తమ నేత ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయం తెలిస్తే ఆయన గెలుపు కోసం అహర్నిశలు పని చేస్తామంటూ శపథాలు చేస్తున్నారు. మరి పవన్ ఈ సారి యాత్రలో అయినా తను ఎక్కడ నుండి పోటీ చేస్తాననే విషయాన్ని ప్రకటిస్తారా లేదా అనే విషయం తెలియాలి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జనసేన దాదాపుగా టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పవన్ ఈ సారి ఒక స్థానం నుండే పోటీ చేసే అవకాశం ఉంది. అందుకే ముందే తమకు క్లారిటీ ఇవ్వాలని జనసైనికులు కోరుతున్నారు.
మరోవైపు మొదటి యాత్రలో అధికార పార్టీ నేతలు ఎన్ని చాలెంజ్‌లు విసిరిన పవన్ కళ్యాణ్ వాటిని పట్టించుకోలేదు. గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కకుండా చేస్తానని శపథం చేసిన ఆయన ముందుగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారని విషయం తేల్చుకొని తమపై శపధాలు చేయాలని వైసీపీ నేతలు సెటైర్లు వేశారు. మరి పవన్ ఎందుకు తన సీటుపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నరనేదే జనసైనికులకు అర్థం కావడం లేదు. దాదాపుగా వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో ఎక్కడో ఒక చోట నిలబడే అవకాశం ఉందని.. ముఖ్యంగా పవన్ చూపు భీమవరం, కాకినాడ రూరల్ వైపు ఉందని.. ఈ రెండింటిలో ఏదో ఒక చోట నిలబడే అవకాశం ఉందని జనసేన పెద్దల నుండి పుకార్లు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ మాత్రం తను పోటీ చేసే నియోజకవర్గం ముందే ప్రకటిస్తే అక్కడ వైసీపీ చేసే రాజకీయాన్ని ముందే ఊహించి వెనక్కు తగ్గుతున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోవడం వెనుక వైసీపీ పోల్ మేనేజ్‌మెంటే ప్రధాన కారణమని పవన్ భావిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నా ఆయన తను నిలబడే నియోజవర్గంపై అచితూచి అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం కులాన్ని నమ్ముకోని రెండు చోట్ల పోటీ చేసినా పరాభవం ఎదురు కావడంతో.. ఈ సారి మాత్రం రకరకల సర్వేల అనంతరం పోటీపై క్లారిటీ ఇచ్చే అలోచనలో ఉన్నారు. అందుకే ప్రత్యర్థి పార్టీలు ఎంత రెచ్చకొడుతున్న వారిపై మాట్లాడటం లేదు.