మంత్రులకు రేబిస్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. నాగబాబు సెటైర్
మంత్రులను విమర్శిస్తూ ఆయన వరుస ట్వీట్లు వేశారు. వైసీపీ మంత్రులు కొందరికి రేబిస్ సోకి బాధపడుతున్నారని, వీరు ఊర్లలోకి వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగబాబు సెటైర్ వేశారు.
దేనికి గర్జనలు.. అనే పేరిట జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై రెండు రోజులుగా ట్విట్టర్ వేదికగా వరుసగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలు హాట్ టాపిక్ అవుతుండగా, ఇందుకు వైసీపీ మంత్రులు రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు తదితరులు కౌంటర్ గా ప్రతి విమర్శలు చేశారు. పవన్ ప్యాకేజీ స్టార్ అని, కుంభకర్ణుడిలా నిద్రపోయి ఇప్పుడే లేచి విమర్శలు చేస్తున్నాడు..అంటూ మంత్రులు మండిపడ్డారు.
వైసీపీ మంత్రులు చేసిన విమర్శలపై నాగబాబు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. మంత్రులను విమర్శిస్తూ ఆయన వరుస ట్వీట్లు వేశారు. వైసీపీ మంత్రులు కొందరికి రేబిస్ సోకి బాధపడుతున్నారని, వీరు ఊర్లలోకి వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగబాబు సెటైర్ వేశారు. రేబిస్ తో బాధపడుతున్న మంత్రులు కనిపించిన సామాన్య ప్రజలను కరిచే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ప్రజలు 2024 ఎన్నికల వరకు జాగ్రత్తగా ఉండాలని.. ఎన్నికల తర్వాత వారికి తగిన మందులతో చికిత్స అందజేస్తామని నాగబాబు సెటైర్ వేశారు. మా నాయకుడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తిన్న బిస్కెట్లకు విశ్వాసం చూపిస్తూ మంత్రులు పవన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి రేబిస్ వ్యాక్సిన్ వేసి ఇంటికి పంపడం తథ్యమని నాగబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పై పవన్ కల్యాణ్ దేనికి గర్జనలు..పేరిట విమర్శలు చేస్తుండడం.. దానికి ప్రతీగా వైసీపీ మంత్రులు కూడా కౌంటర్లు వేస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.