ఆ ఒక్క అబద్ధం చెప్పి ఉంటే అప్పుడు జగన్‌దే అధికారం

రైతులకు రుణమాఫీ చేస్తానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. రైతులకు చెందిన 89 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఆయన వాగ్దానం చేశారు.

Advertisement
Update:2024-02-08 15:31 IST

ఒక్క అబద్ధం చెప్పి ఉంటే 2014లోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చి ఉండేవారు. అయితే, అబద్ధాలు చెప్పి అధికారాన్ని దక్కించుకోవడం ఆయనకు ఇష్టం లేని వ్యవహారం. చేసేది చెప్పాలి, చెప్పింది చేయాలి అనేది వైఎస్‌ జగన్‌ ఫిలాసఫీ. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వాలని జగన్‌కు ఆయన శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. అయితే, ఆయన అందుకు అంగీకరించలేదు. దాంతో ఆయన ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని జగన్‌ స్వయంగా చెప్పారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన ఆ విషయం చెప్పారు.

రైతులకు రుణమాఫీ చేస్తానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. రైతులకు చెందిన 89 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. దాంతో ఆయన అధికారంలోకి వచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్ర‌బాబు మాఫీ చేసిన రైతు రుణాలు కేవలం 15 వేల కోట్లు. ఎన్నికల్లో విజయం సాధించడానికి హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటే.

2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు దాదాపు 600 హామీలు ఇచ్చారు. వాటిలో ఎన్నింటిని అమలు చేశారనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీలను గుర్తు చేసి ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో మ్యానిఫెస్టోను టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తీసేయించారు. ఇదీ చంద్రబాబు నైజం.

Tags:    
Advertisement

Similar News