ఎమ్మెల్యేలు, పరాజితులతో జగన్ ప్రత్యేక సమావేశం

జగన్ సహా పార్టీ తరపున గెలిచిన 11మంది ఎమ్మెల్యేలు.. ఓడిన 164మంది అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు.

Advertisement
Update:2024-06-17 18:02 IST

ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత జగన్.. పార్టీ నేతలతో కీలక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓ దఫా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ ని కలిశారు. ఫలితాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చలు జరిపారు. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి, వారికి అందించాల్సిన భరోసా గురించి కూడా ఈ సమావేశాల్లో ప్రస్తావించారు. తాజాగా ఇప్పుడు మరో కీలక మీటింగ్ కి జగన్ సిద్ధమయ్యారు.

ఈనెల 19న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉదయం పదిన్నర గంటలకు కీలక సమావేశం జరుగుతుందని పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొంటారు. జగన్ సహా పార్టీ తరపున గెలిచిన 11మంది ఎమ్మెల్యేలు.. ఓడిన 164మంది అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై జగన్ వారికి దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.


ఎంపీలకు మినహాయింపు..

ఈ సమావేశం నుంచి ఎంపీలకు మినహాయింపునిచ్చారు. ఇప్పటికే పార్లమెంట్ సభ్యులంతా జగన్ తో ఓసారి సమావేశమయ్యారు. దీంతో వారు ఈ మీటింగ్ కి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వారంతా మీటింగ్ కి తప్పనిసరిగా రావాలని కబురు పంపించారు. 

Tags:    
Advertisement

Similar News