నేను హోం మంత్రి అయితే మరోలా ఉంటుంది..పవన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయిని ఆయన అన్నారు

Advertisement
Update:2024-11-04 15:26 IST

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయిని ఆయన అన్నారు. ఈ విషయంలో హోం మంత్రి అనిత రివ్యూ చేయాలి. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని పవన్ తెలిపారు. క్రిమినల్‌కు కులం, మతం ఉండవు. ఈ విషయం పోలీసు అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకర్ని అరెస్ట్‌ చేయాలంటే కులం సమస్య వస్తుందట. మూడేళ్ల ఆడబిడ్డను అత్యాచారం చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? పవన్ ప్రశ్నించారు. పోలీసు అధికారులు చదువుకుంది ఐపీఎస్‌ కాదా?భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) మీకేం చెబుతోంది. క్రిమినల్స్‌ను వెనకేసుకు రావాలని శిక్షాస్మృతి చెబుతోందా?విషయాన్ని తెగేదాకా లాగొద్దు. కూటమి ప్రభుత్వానికి సహనం ఎంత ఉందో తెగింపు కూడా అంతే ఉంది. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తు్న్నాం. ప్రజల ఆవేదనను ఇలా డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా. శాంతిభద్రతల పరిరక్షణ కీలకమైందని ఎస్పీలు, కలెక్టర్లకు కూడా చెబుతున్నా. ఉన్నతాధికారులు పదేపదే మాతో చెప్పించుకోవద్దు. తప్పులు చేసిన వారిని నా బంధువు, నా రక్తమని ఎవరైనా చెబితే మడతపెట్టి కొట్టండి. నేను ఎవరినీ వెనకేసుకుని రావడం లేదు.

హోంమంత్రిగా అనితకు కూడా చెబుతున్నా.. మంత్రిగా మీరు బాధ్యత వహించండి’’ అని పవన్‌ తెలిపారు.‘గత వైసీపీ ప్రభుత్వంలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే అప్పటి ముఖ్యమంత్రి మాట్లాడలేదన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ హైస్కూల్‌లో సైన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పవన్ అన్నారు. సైన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం పదో తరగతి విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు, ఇతర ఉపకరణాలు పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేపడతామన్నారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని.. అభివృద్ధిపై మాస్టర్‌ ప్లాన్‌ తయారవుతోందని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News