ఎల్లో మీడియానే క్లీన్ చిట్ ఇప్పించేస్తోందా?

తాజాగా చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యంతో ప్రముఖంగా ఇంటర్వ్యూ అచ్చేసింది. ఆయన చెప్పిందేమిటంటే చంద్రబాబు అరెస్టు రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు మిస్టర్ క్లీన్ అని.

Advertisement
Update:2023-09-15 11:32 IST

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఇరుక్కుని అరెస్టయి, రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడికి ఎల్లో మీడియానే క్లీన్ చిట్ ఇచ్చేస్తోంది. ఇందుకోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ఇంటర్య్వూలు అచ్చేస్తోంది. వాళ్ళంతట వాళ్ళే ఎల్లో మీడియాతో మాట్లాడుతున్నారా? లేకపోతే ఎల్లో మీడియానే వాళ్ళతో మాట్లాడిస్తోందా అన్నది అప్రస్తుతం. తాజాగా చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యంతో ప్రముఖంగా ఇంటర్వ్యూ అచ్చేసింది. ఆయన చెప్పిందేమిటంటే చంద్రబాబు అరెస్టు రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు మిస్టర్ క్లీన్ అని.

ఒకసారి క్యాబినెట్‌లో రెజల్యూషన్ అయిన తర్వాత అంశంపై ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి, మంత్రి లేదా సెక్రటరీపై బురదచల్లటం చాలా తప్పన్నారు. ఎల్వీ ఏమి మాట్లాడినా సారంశం ఏమిటంటే చంద్రబాబును అరెస్టు చేయటం రాజ్యాంగ విరుద్ధమనే. అలాగే జగన్మోహన్ రెడ్డిపై ఎక్కడా డైరెక్టుగా ఆరోపణలు, విమర్శలు చేయకపోయినా జగన్ తప్పుచేశారని చెప్పటమే. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాక అమలు చేసిన అధికారులదే తప్పుంటుంది కానీ ముఖ్యమంత్రి, మంత్రుల పాత్ర ఏమీ ఉండదని తేల్చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ అక్రమార్జన కేసుల్లో ఎల్వీ మీద కూడా కేసులు నమోదై అరెస్టయ్యారు.

మరి అప్పుడు తాను తప్పు చేసినట్లు ఎల్వీ ఎందుకు కోర్టుల్లో అంగీకరించలేదు? నిర్ణయం తీసుకున్న అప్పటి క్యాబినెట్‌దే తప్పని ఎందుకని కోర్టుల్లో వాదించారు? క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్నే తాము అమలు చేశాం కాబట్టి అందులో తన తప్పేమీ లేదని వాదించారు. మరిపుడేమో తప్పంతా అధికారులపైనే ఉంటుందని చెబుతున్నారు.

మొన్ననే మరో రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ కూడా ఇలాగే చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఒత్తిడి మేరకు నిబంధనలకు విరుద్ధంగా స్కిల్ డెవలప్మెంట్‌కు నిధులు విడుదల చేశామని ఫైనాన్స్ ప్రిన్సిప‌ల్‌ సెక్రటరీగా పనిచేసినప్పుడు నోట్ ఫైల్‌లో చెప్పారు. మెజిస్ట్రేట్ ముందు కూడా ఇలాగే వాగ్మూలం ఇచ్చారని అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి మీడియాతో చెప్పారు. కానీ ఇప్పుడేమో చంద్రబాబు తప్పేమీలేదు తప్పంతా అధికారులదే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మొత్తంమీద స్కామ్‌లో ఇరుక్కున్న చంద్రబాబుకు ఎల్లో మీడియా క్లీన్ చిట్ ఇప్పించేందుకు తెగ అవస్థ‌లు పడుతోంది.


Tags:    
Advertisement

Similar News