రోజా స్టార్ క్యాంపెయినరేనా..?

రోజాను తీవ్రంగా వ్యతిరేకించే బలమైన గ్రూపు తయారైంది. విచిత్రం ఏమిటంటే.. జగన్ దగ్గర రోజాకు ఎంత యాక్సెస్ ఉందో రోజా వ్యతిరేక సంఘానికి కూడా అంతే యాక్సెస్ ఉంది.

Advertisement
Update:2023-12-17 09:47 IST

రాబోయే ఎన్నికల్లో నగిరి ఎమ్మెల్యే, మంత్రి రోజా సేవలను స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు సమాచారం. రాబోయే ఎన్నికలు జగన్‌కు అత్యంత కీలకమైనవి. రాష్ట్రవ్యాప్తంగా తానొక్కడే ప్రచారం చేయాలంటే కష్టమని అనుకుంటున్నారట. అందుకనే తనకు మరో ఇద్దరు ముగ్గురు సాయం అవసరమని జగన్ భావించినట్లు పార్టీవర్గాల సమాచారం. అందుకనే తనకు తోడుగా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, రోజాల సహకారాన్ని తీసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారట.

రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేయనని, కాబట్టి తన కొడుకు రామ్ మనోహర్ నాయుడుకు టికెట్ ఇవ్వమని ధర్మాన ప్రసాదరావు ఎప్పటినుండో అడుగుతున్నారు. జగన్ మాత్రం ధర్మానను శ్రీకాకుళం ఎంపీగా పోటీచేయాలని అడుగుతున్నారట. అయితే తాజా పరిణామాల్లో ధర్మానతో ప్రచారం చేయించాలని జగన్ ఆలోచిస్తున్నారట. అలాగే నగరిలో రోజాకు పార్టీలోనే బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. రోజా మంత్రిగా ఉన్నా ఆమెకు సమాంతరంగా పార్టీలోని కొందరు నేతలు వ్యవహారాలు నడుపుతున్నారు.

రోజాను తీవ్రంగా వ్యతిరేకించే బలమైన గ్రూపు తయారైంది. విచిత్రం ఏమిటంటే.. జగన్ దగ్గర రోజాకు ఎంత యాక్సెస్ ఉందో రోజా వ్యతిరేక సంఘానికి కూడా అంతే యాక్సెస్ ఉంది. వ్యతిరేక గ్రూపులో కుమార్, శాంతి దంపతులు, శ్రీశైలం ట్రస్టుబోర్డు ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి బలమైన నేతలనే చెప్పాలి. వీరు కాకుండా జడ్పీటీసీ మురళీధరరెడ్డి తదితరులు కూడా ఉన్నారు. ఆరేడుమంది కలిసి రోజా వ్యతిరేక గ్రూపుగా తయారయ్యారు. వీళ్ళకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుందని ప్రచారం.

రాబోయే ఎన్నికల్లో రోజాకు మళ్లీ టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతుందని వీళ్ళు జగన్‌కు చెప్పారట. అలాగే సర్వేల్లో కూడా రోజాకు మైనస్ మార్కులే వచ్చాయని సమాచారం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రోజా సేవలను స్టార్ క్యాంపెయినర్‌గా వాడుకోవాలని జగన్ అనుకుంటున్నారట. స్టార్ క్యాంపెయినర్ పోస్టుకు రోజా సరిగ్గా సరిపోతారని పార్టీలో టాక్ నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని రోజాకు జగన్ చెప్పినట్లు సమాచారం. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News