అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులే

అభివృద్ధి పనులు చేస్తేనే సంపద పెరుగుతుందన్న ఏపీ సీఎం

Advertisement
Update:2025-01-27 21:58 IST

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్‌ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. నాయకుల అసమర్థత వల్ల ప్రజలు, రాష్ట్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగా లేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుంది. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి వస్తుంది. అదే జరిగితే చివరికి బాధపడేది ప్రజలే. రాష్ట్ర, దేశ భవిష్యత్తు గురించి అందరూ ఆలోచించాలి. అభివృద్ధి పనులు చేస్తేనే సంపద పెరుగుతుంది. అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు తప్పవు అని సీఎం చంద్రబాబు అన్నారు. 

Tags:    
Advertisement

Similar News