కర్నూల్‌లో ఏర్పాటు కానున్న హైకోర్టు బెంచ్‌

శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం

Advertisement
Update:2024-11-21 12:57 IST

కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శాసనసభలో లో తీర్మానం ప్రవేశపెట్టింది. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ దీన్ని ప్రవేశపెట్టారు. కర్నూల్‌లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రజల నుంచి డిమాండ్‌ ఉంది. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కర్నూలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. దీనిపై ఇటీవల సీఎం సమీక్ష నిర్వహించి.. బెంచ్‌ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సభలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్చించి అమోదం తెలుపనున్నారు. 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కర్నూలు, విశాఖపట్నంలోనూ రాజధాని అమరావతి అని చెప్పిన ఘటన కూటమిది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. గతంలో చేశామని, ఇప్పుడూ చేసి చూపిస్తున్నామన్నారు. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి లాంటి ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఇప్పడు ఆ ప్రాజెక్టులను పూర్తిచేసేది ఎన్డీఏ ప్రభుత్వమే అన్నారు. కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకెళ్లాం. నదుల అనుసంధానంతో రాయలసీమకు తాగు, సాగు నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు క్లస్టర్ల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించామని చంద్రబాబు వివరించారు. 

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేసేందుకు కాంపిటెంట్ అథారిటీ ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని న్యాయశాఖ కార్యదర్శిని కోరారు. ఈ మేరకు గతనెల 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 


Tags:    
Advertisement

Similar News