ఎలక్షన్ మూడ్.. ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2

గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి 900కిపైగా పోస్టులతో నోటిఫికేషన్లు వెలువడతాయి.

Advertisement
Update:2023-05-25 16:07 IST

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు వెలువడబోతున్నాయి. నోటిఫికేషన్ల జారీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈసారి దాదాపు వెయ్యి పోస్ట్ లు భర్తీ చేసే అవకాశాలున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక విడుదలయ్యే గ్రూప్స్ తొలి నోటిఫికేషన్లు ఇవే కావడం విశేషం.

గ్రూప్-1, గ్రూప్ -2 పోస్టుల భర్తీకి సంబంధించి అధికారులు సీఎం జగన్ కి వివరాలు అందించారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్ట్ ల వివరాలు ఇప్పటికే సేకరించామని, సీఎం అనుమతి ఇచ్చారు కాబట్టి త్వరలో పూర్తి స్థాయి కసరత్తు చేసి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు అధికారులు.

గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి 900కిపైగా పోస్టులతో నోటిఫికేషన్లు వెలువడతాయి. పరీక్షల నిర్వహణ పగడ్బందీగా ఉండాలని, ఫలితాల విడుదల విషయంలో కూడా పక్కాగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ పోస్ట్ ల పేరుతో భారీగా నియామకాలు జరిగాయి. కానీ నిరుద్యోగులు ఎక్కువగా ఎదురు చూసేది గ్రూప్స్, డీఎస్సీ. ఆ రెండు నియామకాలు ఇంకా మొదలు కాలేదు. ఎన్నికల ఏడాదిలో ఇప్పుడు గ్రూప్స్ పై తీపి కబురు చెప్పారు. డీఎస్సీ విషయంలో ట్రాన్స్ ఫర్లు, ప్రమోషన్లు పూర్తయితే ఖాళీలపై ఓ అవగాహన వస్తుంది. ఆ తర్వాత టీచర్ పోస్ట్ లు భర్తీ చేస్తారా లేదా అనేది తేలిపోతుంది. 

Tags:    
Advertisement

Similar News