వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే రోజు రెండు భారీ షాక్‌లు తగిలాయి. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు.

Advertisement
Update:2024-12-12 16:49 IST

వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రిజైన్ లేటర్‌ను వైసీపీ అధినేత జగన్‌కు పంపారు. వైసీపీ సభ్యత్వానికి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు లేఖను అధిష్ఠానానికి పంపించారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ తీరుపై గ్రంధి అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఒకే రోజు ఇద్దరు నేతలు వైసీపీకి రాజీమానా చేయడం ఏపీ రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో బ్రిటీష్‌ విధానాలు నచ్చకే పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఐదేండ్లు పాలించాలని కూటమికి రాష్ట్ర ప్రజలు తీర్పు చెబితే కనీసం ఐదు నెలలు కూడా టైం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ అంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గత ఐదేండ్లు పార్టీ కార్యకర్తలు నలిగిపోయారన్నారు. తాడేపల్లిలో కూర్చుని ఆయన (జగన్) ఆదేశాలిస్తే.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News