ఈడీ ముందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ఈడీ కార్యాలయంలో గుర్నాథ్‌ రెడ్డిని విచారిస్తున్నారు. క్యాసినో నిర్వాహకుడు ప్రవీణ్ నేపాల్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు వెళ్లిన వారందరినీ ఈడీ విచారిస్తోంది.

Advertisement
Update:2022-11-17 14:06 IST

ఈడీ ముందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి

క్యాసినో వ్యవహారం వైసీపీ నేతల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో వైసీపీ అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ఈడీ కార్యాలయంలో గుర్నాథ్‌ రెడ్డిని విచారిస్తున్నారు. క్యాసినో నిర్వాహకుడు ప్రవీణ్ నేపాల్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు వెళ్లిన వారందరినీ ఈడీ విచారిస్తోంది.

ఆ సమయంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్టు ఈడీ గుర్తించింది. ఈ కేసులో చికోటి ప్రవీణ్, అతడి అనుచరుడు మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించిన సమయంలో బ్యాంకు ఖాతా బుక్‌లను, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ డేటాను విశ్లేషించగా అనేక మంది నేతలతో ప్రవీణ్‌ చాట్‌ చేసినట్టు తేలింది. పలు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు.

గుర్నాథ్‌ రెడ్డి కూడా నేపాల్ వెళ్లి క్యాసినో ఆడి ఉండవచ్చని ఈడీ అనుమానిస్తోంది. ఈ కోణంలో ప్రశ్నించేందుకే గుర్నాథ్‌ రెడ్డిని ఈడీ విచారణకు పిలిచింది. నేపాల్‌లో క్యాసినో చట్టబద్ధమే అయినప్పటికీ ఇక్కడి నుంచి అక్కడికి నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రవీణ్ అండ్ టీం కాయిన్స్‌ను వాడింది. నేపాల్‌కు వెళ్లి క్యాసినో ఆడాలనుకునే వారు ప్రవీణ్‌ను సంప్రదించి నగదు చెల్లిస్తే.. అందుకు తగ్గట్టు విలువను చూపే కాయిన్స్‌ను ప్రవీణ్ ఇచ్చేవాడు.

ఆ కాయిన్స్‌ను తీసుకెళ్లి నేపాల్‌లో ఇస్తే అక్కడ క్యాసినో నిర్వాహకులు ఆడేందుకు డబ్బు ఇచ్చేవారు. క్యాసినో ఆడి డబ్బు గెలిస్తే.. ఆ డబ్బును నేపాల్‌లోనే నిర్వాహకులకు ఇస్తే వారు తిరిగి కాయిన్స్ ఇచ్చే వారు. ఆ కాయిన్స్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో ప్రవీణ్‌కు ఇస్తే అందుకు తగ్గట్టు నగదు ఇచ్చేవాడు. ఫెమా నిబంధనలను బ్రేక్ చేసేందుకే ఇలా కాయిన్స్ సాయంలో వ్యవహారం నడిపినట్టు ఈడీ గుర్తించింది. నేపాల్‌ వెళ్లినవారిని, వెళ్లినట్టు అనుమానం ఉన్నవారిని ఈడీ విచారణకు పిలుస్తోంది. అందులో భాగంగానే వైసీపీ నేత గుర్నాథ్‌ రెడ్డిని విచారిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News