జనసేనను టీడీపీకి లాంగ్ లీజుకు ఇచ్చారు
చంద్రబాబుకు కొత్తగా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రేమ పుట్టుకొచ్చిందని నాని అన్నారు. ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించటం విడ్డూరంగా ఉందన్నారు.
పార్టీ పెట్టి పదేళ్లు దాటినా ఆత్మస్థైర్యం లేకుండా పనిచేస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. టెంట్ హౌస్లా అద్దెకు ఇచ్చే పార్టీని ఆయన నడుపుతున్నారని చెప్పారు. పవన్ తన పార్టీని చంద్రబాబుకు లాంగ్ లీజుకు ఇచ్చారని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో జీవనం సాగిస్తూ ఆంధ్రాలో రాజకీయం చేయటం చంద్రబాబుకు, పవన్‌కే చెల్లిందని చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్యేలపై బాబుకు ప్రేమ పుట్టుకొచ్చింది..
చంద్రబాబుకు కొత్తగా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రేమ పుట్టుకొచ్చిందని నాని అన్నారు. ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించటం విడ్డూరంగా ఉందన్నారు. మరి చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లాడు.. కోడెల శివప్రసాద్‌ను నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి ఎందుకు పంపారో..? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న రాజకీయం చూసి చంద్రబాబుకు షాక్ తగిలిందన్నారు.
గోతికాడ నక్కలా రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాలుకల ధోరణితో చంద్రబాబు మాట్లాడుతున్నాడని విమర్శించారు. 175 సీట్లలో విజయం సాధించాలనే దిశగా సీఎం జగన్ పనిచేస్తుంటే.. చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతు న్నాయన్నారు. నువ్వు చేస్తే రాజ్యాంగబద్ధం.. వేరొకరు చేస్తే తప్పు అని మాట్లాడటమా అని చం ద్రబాబును ప్రశ్నించారు. మరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నావని నిలదీశారు. అగ్రవర్ణానికి చెందిన ఎంపీ రాజును ఎలా అక్కున చేర్చుకున్నావో చెప్పాలన్నారు.