బ్రోకర్ ఛానల్స్, బ్రోకర్ జర్నలిజం.. మాజీ మంత్రి అనిల్ ఆగ్రహం

ఇటీవల నెల్లూరులో పెన్నా బ్యారేజ్ ని సీఎం జగన్ ప్రారంభించారు. అయితే బ్యారేజ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని కొన్ని ఛానల్స్ లో వార్తలొచ్చాయి. దీనిపై అనిల్ తీవ్రంగా స్పందించారు.

Advertisement
Update:2022-09-09 12:19 IST

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి కొన్ని మీడియా ఛానల్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో తనకు వ్యతిరేకంగా పనిచేయడమే ఆ ఛానల్స్ లక్ష్యంగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. వారి సపోర్ట్ లేకపోతే తాను పైకి ఎదగలేనన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయని, అలాంటివారి అవసరం తనకు లేదన్నారు. తనకు సీఎం జగన్, నెల్లూరు సిటీ ప్రజల ఆశీస్సులుంటే చాలన్నారు అనిల్.

ఇటీవల నెల్లూరులో పెన్నా బ్యారేజ్ ని సీఎం జగన్ ప్రారంభించారు. అయితే బ్యారేజ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని కొన్ని ఛానల్స్ లో వార్తలొచ్చాయి. దీనిపై అనిల్ తీవ్రంగా స్పందించారు. కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిపోయాయని, వాటిని పూర్తి చేస్తున్నారని, పదిరోజుల్లో బ్యారేజ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

తమ హయాంలో ఏమీ పీకలేని టీడీపీ.. ఇప్పుడు నెల్లూరుకు అనిల్ ఏమీ చేయలేదని ఆరోపిస్తోంద‌ని, దమ్ముంటే నెల్లూరు అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కొంతమంది రాత్రిపూట తమ పార్టీ నేతలతో టచ్ లోకి వస్తున్నారని, అలాంటి పనులు తాను చేయనని, అందుకే తనని టార్గెట్ చేసి తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు. నెల్లూరులో కొంతమందికే భజన చేసే ఛానల్స్, తనని కావాలనే తక్కువచేసి చూపిస్తున్నాయని, అలాంటి వారికి తాను భయపడబోనని స్పష్టం చేశారు.

ఆ మధ్య నెల్లూరులో వెన్నుపోటుదారులున్నారంటూ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు, ఆ తర్వాత కొన్నిరోజులకే ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకున్నారు. తాజాగా నెల్లూరులో రూప్ కుమార్, అనిల్ ని డామినేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు మంత్రి కాకాణి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సపోర్ట్ ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని బలపరిచేలా ఇటీవల కాకాణి, శ్రీధర్ రెడ్డితో కలసి రూప్ కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరంతా కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారంటూ అనిల్ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్రోకల్ ఛానల్స్, బ్రోకర్ జర్నలిజం అంటూ మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News