కాలి బూడిదైన ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్..

గత నెలలో సికింద్రాబాద్‌లో ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ తగలబడింది. నెల రోజుల వ్యవధిలో పొరుగు రాష్ట్రం ఏపీలో ఇదే తరహా దుర్ఘటన జరగడం విచారకరం. పాలకొండలో జరిగిన ప్రమాదంలో 25 బైక్‌లు దగ్ధమయ్యాయి.

Advertisement
Update:2022-10-24 13:55 IST

దీపావళి ముందు రోజు ఏపీలో రెండు చోట్ల టపాకాయల దుకాణాలు తగలబడి ఆస్తి నష్టంతోపాటు, ప్రాణ నష్టం కూడా జరిగింది. రాత్రికి ఏకంగా ఎలక్ట్రిక్ బైక్ షోరూమే తగలబడిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 బైక్‌లు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన fire accident at electric bike showroom parvathipuramజరిగింది.

గత నెలలో సికింద్రాబాద్‌లో ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ తగలబడింది. ఈ ఘటనలో షోరూమ్ పైన హోటల్ లో ఉన్నవారు 8 మంది దుర్మరణం పాలయ్యారు. షాపులోని ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కాలి బూడిదగా మారాయి. నెల రోజుల వ్యవధిలో పొరుగు రాష్ట్రం ఏపీలో ఈ దుర్ఘటన జరగడం విచారకరం. ఇక్కడ ప్రాణ నష్టం జరక్కపోయినా ముందు మందు ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్‌లకు షాపులు అద్దెకివ్వాలన్నా యజమానులు భయపడే పరిస్థితి నెలకొంది.

షాపుల్లోనే కాదు, ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్‌లు దీపావళి టపాసుల్లా పేలిపోతున్నాయి. పరిమితికి మించి చార్జింగ్ పెట్టడం ప్రాథమిక కారణంగా తేలుతోంది, చార్జింగ్ విషయంలో లోపాలు, షార్ట్ సర్క్యూట్ కారణాల వల్ల బ్యాటరీలు పేలి ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతున్నాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి. దీంత కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక బయటకొచ్చేలోపే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి, అదే సమయంలో ప్రమాదాలూ పెరుగుతున్నాయి. మొత్తమ్మీద ఎలక్ట్రిక్ బైక్‌లపై ఆమధ్య విపరీతమైన క్రేజ్ పెరిగినా, ఇప్పుడది పూర్తిగా చల్లారిపోయినట్టు తెలుస్తోంది. వరుస ప్రమాదాలతో వాహనదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలంటేనే భయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News