అధికారం శాశ్వతం కాదు -జోగి

అమెరికాలో చదివి, ఉద్యోగం చేస్తున్న తన కొడుకుని అగ్రి గోల్డ్ కేసులో ఇరికించారని అన్నారు జోగి రమేష్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పారు.

Advertisement
Update:2024-08-16 18:13 IST

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయని, అందుకే జాగ్రత్తగా ఉండాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఈరోజు జోగి రమేష్ పోలీస్ విచారణకు హాజరయ్యారు. తన ఫోన్ ని పోలీసులకు అందించారు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన జోగి, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనని, తన కొడుకుని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.


అమెరికాలో చదివి, ఉద్యోగం చేస్తున్న తన కొడుకుని అగ్రి గోల్డ్ కేసులో ఇరికించారని అన్నారు జోగి రమేష్. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పారు. తమని ఇబ్బంది పెడతామంటూ బహిరంగంగానే మంత్రి లోకేష్ చెప్పడం సరికాదన్నారు. ఏపీలో కూటమి నేతలకు రాజకీయ విలువలు లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు జోగి రమేష్‌.

సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకుండా తప్పించుకోడానికే ఇలా రాజకీయ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు జోగి రమేష్. వైఎస్‌ జగన్‌పై చేసిన విమర్శలకు ప్రతిగా నిరసన తెలిపేందుకే తాను ఆనాడు చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లానని గుర్తు చేశారు. తనకు దాడులు చేసే సంస్కృతి లేదని, అది తన విధానం కాదన్నారు. లోకేష్ రెడ్ బుక్ తీస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. వైసీపీని అడ్డుకోవాలనుకోవడం సాధ్యం కాదన్నారు. తనను మళ్లీ పోలీసులు విచారణకు పిలవలేదని చెప్పారు. పిలిస్తే వెళ్లి అన్నీ వివరిస్తానన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి తానీ స్థాయికి వచ్చానని, తనకు పార్టీ సపోర్ట్ ఉందన్నారు జోగి రమేష్. 

Tags:    
Advertisement

Similar News