లోకేశ్ మంత్రి అయినా..కొడుకు బాధ్యత మరవలేదు

బాపట్ల ప్రభుత్వ పాఠశాలలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తన తండ్రి చంద్రబాబు తిన్న ప్లేట్‌ను లోకేశ్ స్వయంగా తీశారు.

Advertisement
Update:2024-12-07 18:41 IST

ఏపీ వ్యాప్తంగా పేరేంట్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. బాపట్ల ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తన తండ్రి చంద్రబాబు తిన్న ప్లేట్‌ను లోకేశ్ స్వయంగా తీశారు. అక్కడ భోజనం అనంతరం వారి ప్లేట్లను లోకేశ్ తీయడాన్ని ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందించారు. వెల్‌డన్ లోకేశ్, చంద్రబాబు ప్లేట్‌ని నువ్వు తీయడం, అక్కడి సిబ్బందికి సాయం చేయడం తల్లిదండ్రుల పట్ల నీకున్న గౌరవాన్ని, అణకువను సూచిస్తోంది. నిజంగా స్పూర్తిదాయకం అని ఆమె ట్వీట్ చేశారు.ఉపాధ్యాయులు, విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. వారి పరీక్ష ఫలితాలను పరిశీలించారు.

వారి విద్యాభ్యాసం సామర్థ్యాలను పరీక్షించారు. పిల్లల జీవిత లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.వారికి పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలు ఆయన విన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. బాపట్లలో విద్యార్థుల క్రీడా పోటీలను చంద్రబాబు ప్రారంభించారు. సరదాగా కాసేపు వారితో కలిసి టగ్‌ ఆఫ్‌ వార్‌లో పాల్గొన్నారు. 

Tags:    
Advertisement

Similar News