పేద పిల్లలకు ఇంగ్లీష్‌ చదువు.. ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌

కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలున్న కోట్లకు పడగలెత్తిన వాళ్లకి ఇది కంపరం పుట్టిస్తోంది. బడుగు బలహీన వర్గాల వారి పిల్లలకు ఇంగ్లీషు చదువులెందుకని వాళ్లు నిలదీస్తున్నారు.

Advertisement
Update:2024-04-04 17:26 IST

నిరుపేదలకు, దళిత బహుజన బిడ్డలకు ఇంగ్లీష్‌ చదువెందుకు..? అనే ఒక వింత వాదన ప్రచారంలో వుందిపుడు. ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం అంటున్నవాళ్లే ఈ మాటలు చెబుతున్నారు. కేవలం జగన్‌ ఏం చేసినా వ్యతిరేకించాలన్న వైఖరితో ఉన్నవాళ్ల టెక్నిక్‌ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో, గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగ్లీషు విద్య అనే ఆశయం నెరవేరుతున్న కొద్దీ వీళ్లలో అసహనం పెరిగిపోతోంది. స్కూళ్లకి కొత్త భవనాలు, బిడ్డలకు మంచి యూనిఫాంలు, బూట్లు, బుక్స్‌ ఇచ్చి చదువు విలువని పెంచింది జగన్‌ ప్రభుత్వం.

కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలున్న కోట్లకు పడగలెత్తిన వాళ్లకి ఇది కంపరం పుట్టిస్తోంది. బడుగు బలహీన వర్గాల వారి పిల్లలకు ఇంగ్లీషు చదువులెందుకని వాళ్లు నిలదీస్తున్నారు. విద్య మీద పూర్తి అవగాహన ఉన్న మేధావి, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య, జగన్‌ చేస్తున్న మంచి పనిని మెచ్చుకుంటూ, చంద్రబాబు వర్గం విమర్శలని తిప్పికొట్టారు.

‘‘గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడా లేని విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలైంది. కానీ, తమ పిల్లల్ని ఖరీదైన ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో చదివించిన వారు–పేదలు తమ పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోవాలని కోరుకుంటే వ్యతిరేకించారు. ఇది విచిత్ర చారిత్రక సన్నివేశం. దేశంలో ప్రైవేట్‌ విద్య ఎంత ఖర్చుతో కూడుకున్నదో, ఏ భాషలో సాగుతున్నదో తెలియదా..? ప్రజా మేధావులకు తెలివి కన్నా, బీద ప్రజల పక్షాన నిలబడే హృదయం ఉండాలి కదా..! దేశ చరిత్రలో మొదటిసారి విద్యా సమానత్వం ప్రయోగాన్ని జగన్‌ ప్రభుత్వం చేస్తోంది. ఆ ప్రక్రియను వ్యతిరేకించే మూడు పార్టీల కూటమిని సమర్థించే మేధావులను ప్రజలు వ్యతిరేకించాలి.. తమ పిల్లల భవిష్యత్‌ కోసం! అంటున్నారు ఐలయ్య.

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇంగ్లీషు మీడియంలో బోధనని చంద్రబాబు, వెంకయ్య నాయుడు, జయప్రకాశ్ నారాయణ్, సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ రమణ గట్టిగానే వ్యతిరేకించారు. వీళ్లకి ఇంగ్లీష్‌ భాష ప్రాధాన్యం తెలియక కాదు. వీరు కాక, మీడియా రంగంలో ఈనాడు గ్రూపు, ఆంధ్రజ్యోతి గ్రూపు, టీవీ5 నెట్‌ వర్క్‌ అధిపతులు, తమ పిల్లల్ని మంచి మంచి ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివించి, రైతులు, కూలీలు, దళితులు, బీసీలు, ఆదివాసులు తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో కావాలంటే వ్యతిరేకించారు. ఇది దుర్మార్గమైన రాజకీయ ఎత్తుగడ!

2014 నాటి ప్రతిపక్ష గ్రూపు మళ్లీ జతకట్టింది. జగన్ని ఓడించాలని పట్టుదలతో పనిచేస్తోంది. గ్రామీణ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువు ఆపెయ్యడం వాళ్ల లక్ష్యం.

ఒక చిన్న విశేషం.. అమరావతిని రాజధానిని చేస్తాననే నెపం మీద చంద్రబాబు 30 వేల ఎకరాలు తీసుకున్నపుడు, వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి. ఆయన సలహా సహకారం లేకుండా చంద్రబాబు ఆ పని చేయలేడు. ఇలాంటి రాజకీయ వ్యాపారంలో భాగంగానే పేదలకు ఇంగ్లీష్‌ చదువులెందుకు..? అంటున్నారు. దీని వెనక దాగి ఉన్న కుట్రని అర్థం చేసుకోగలగాలి.

మరో ఉదాహరణ.. 2024–25 సంవత్సరానికి ధీరూభాయి అంబానీ కొడుకు, కోడలు నడిపే స్కూలు ఫీజు ఎంతో తెలుసా..? ఒక్క ఏడాదికి ఎల్‌కేజీ విద్యార్థి ఫీజు 1,70,00 రూపాయలు. 8–10వ తరగతి పిల్లల ఫీజు రూ.9,65,000. ఇటువంటి స్కూళ్లు దేశంలో చాలా ఉన్నాయి. ఇంతింత ఫీజులు, విదేశీ సిలబస్, ఇంగ్లీష్‌ మీడియంలో చదివే పిల్లల్ని, జగన్‌ మోడల్‌ విద్యా విధానం ద్వారా కాక ఎలా ఎదుర్కోగలం..?

జగన్‌ చేస్తున్న మంచి పనులపైనా విషం చిమ్మడం సమాజ శ్రేయస్సు కోసమేనా..?

Tags:    
Advertisement

Similar News