పవన్‌ కల్యాణ్ కథ కంచికి.. చంద్రబాబు ఇంటికి.. తాజా సర్వే

భీమిలీ, ఏలూరు సభలు లక్షల జనంతో కిటకిటలాడటంతో జగన్‌ గెలుపు మీద గొప్ప భరోసాతో ఉన్నారు. ఈలోగా కాస్త పరువూ మర్యాదా ఉన్న ఒక సంస్థ పోల్‌ సర్వే జరిపింది.

Advertisement
Update:2024-02-04 20:27 IST

ఒకటే ఉత్కంఠ. అక్కడ రాజకీయ పార్టీలు గోళ్లు కొరుక్కుంటున్నాయి. సామాన్య జనం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రాజకీయ డబ్బు ఎక్కువైనవాళ్లు బెట్టింగ్‌ అంటూ కోట్లకు కోట్ల పందేలకు సిద్ధం అవుతున్నారు. జగన్ని పంపించేస్తున్నాం అని జనసేనవాళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. జగన్ని తరిమికొట్టండి అని చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు. భీమిలీ, ఏలూరు సభలు లక్షల జనంతో కిటకిటలాడటంతో జగన్‌ గెలుపు మీద గొప్ప భరోసాతో ఉన్నారు. ఈలోగా కాస్త పరువూ మర్యాదా ఉన్న ఒక సంస్థ పోల్‌ సర్వే జరిపింది. ఆ సంస్థ పేరు ‘ఎలెక్‌ సెన్స్‌’. 2024లో జరగబోతున్న ఆంధ్ర ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి పార్టీకి 49.14 శాతం ఓట్లు వస్తాయనీ, 122 అసెంబ్లీ స్థానాల్లో ఫ్యాన్‌ గుర్తు విజయం సాధిస్తుందనీ ఆ సర్వేలో తేలింది. వైఎస్సార్‌ సీపీకి ఎమ్మెల్యేలు తగ్గడం ఖాయమనీ, అయినా జగన్‌ నెగ్గడం తిరుగులేదని వాళ్ల అంచనా.

జనసేన–టీడీపీ కూటమి గట్టిపోటీ ఇస్తుందని, వాళ్లకి ఏకంగా 44.34 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. కాంగ్రెస్‌కి 1.21 శాతం ఓట్లు, బీజేపీకి 0.56 శాతం ఓట్లు, ఇతరులకు 4.75 శాతం ఓట్లు వస్తాయని ఆ సమగ్ర సర్వే నిర్ధారించింది. 2023 డిసెంబర్‌ 1 నుంచి 2024 జనవరి 12వ తేదీల మధ్య ఎలెక్‌ సెన్స్‌ ఈ సర్వే జరిపింది. రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో, 88,700 శాంపిల్‌ సైజుతో సర్వే నిర్వహించారు. ఈ సంస్థ ప్రతినిధులు నేరుగా ఓటర్లని కలిసి వివరాలు సేకరించారు. సందేహంగా అనిపించిన 10–15 శాతం శాంపిల్స్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రంలో జగన్‌ అమలు చేస్తున్న పథకాలు, శాంతిభద్రతలు, ప్రస్తుత రాజకీయ సంఘటనలు, టీడీపీ–జనసేన పొత్తు, ఉపాధి, ఉద్యోగావకాశాలు వంటి అంశాలపై ప్రశ్నలు తయారు చేశారు. అలాగే ప్రజల నుంచి స్పష్టమైన సమాధానాలు రాబట్టగలిగారు. కులాన్ని కూడా ముఖ్యమైన అంశంగా గుర్తించి, సర్వేలో పరిగణనలోకి తీసుకున్నారు.

సర్వే తేల్చింది ఏమిటి..? వైసీపీకి 122 సీట్లు, తెలుగుదేశం–జనసేన కూటమికి 53 సీట్లు వస్తాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌కి 53.7 శాతం మంది జై కొట్టారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ మంది మళ్లీ జగనే రావాలంటున్నారు. మహిళా ఓటర్లలో 54.77 శాతం మంది వైసీపీకి మద్దతుగా ఉన్నారు. వయసు రీత్యా చూస్తే 60 ఏళ్లకు పైబడిన వాళ్లలో 55.07 శాతం మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. 45–60 ఏళ్ల వయసు కేటగిరీలో 55 శాతం మంది, 30–45 ఏజ్‌ గ్రూప్‌లో 50.72 శాతం మంది వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 18–30 ఏళ్ల ఏజ్‌గ్రూప్‌లో 53 శాతం మంది తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారు. ఏది ఎలా ఉన్నా మహిళల సహకారంతో జగన్‌ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అనేది తేల్చి చెబుతోందీ సర్వే.

ఎన్నికలు ఇంకా రెండు నెలల తర్వాత జరుగుతాయి గనక పవన్‌–టీడీపీ పుంజుకొని మరో పది, పదిహేను సీట్లు ఎక్కువ గెలుచుకున్నా, కనీసం వంద సీట్లతో జగన్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మేజిక్‌ ఫిగర్‌ 90 సీట్లు వస్తేనే విజయం సంపూర్ణం అవుతుంది. వంద సీట్లు అనేది తిరుగులేని గెలుపు అని రాజకీయ పండితులు అంటున్నారు. విజయం వైపు జగన్, పలాయనం దిశగా పవన్, అవమాన భారంతో చంద్రబాబు.. ఇదీ ఆంధ్ర రాజకీయ భవిష్యత్తు..!

Tags:    
Advertisement

Similar News