సర్వర్లు డౌన్.. ఏపీలో ప్రభుత్వ టీచర్ల అవస్థలు

నాడు-నేడు పేరుతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోంది. అయితే విద్యా వ్యవస్థకు సంబంధించిన వెబ్ సైట్ల నిర్వహణకోసం, సర్వర్ల సామర్థ్యం పెంచడంకోసం మాత్రం నామమాత్రపు నిధులు విడుదల చేస్తుంటారు.

Advertisement
Update:2023-03-28 11:07 IST

ప్రైవేట్ కంపెనీల సర్వర్లు ఎప్పుడూ స్లో అయిన ఉదాహరణలు ఉండవు. అదేంటో ప్రభుత్వ సర్వర్లు మాత్రం నత్తనడకన సాగుతుంటాయి. వారం రోజుల క్రితం ఏపీలో రెవెన్యూ సహా అన్ని విభాగాల్లో ప్రభుత్వ సర్వర్లు డౌన్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రత్యేకంగా విద్యా వ్యవస్థకు చెందిన సర్వర్లు స్లో అయ్యాయని, వాటిలో విద్యార్థుల మార్కులు ఎంట్రీ చేయడానికి అవస్థలు పడాల్సి వస్తోందనేది ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆరోపణ.

ఫార్మేటివ్ అసెస్ మెంట్, సమ్మేటివ్ అసెస్ మెంట్ పరీక్షలు నిర్వహించి వాటిని ప్రభుత్వ సర్వర్లలో అప్లోడ్ చేయడం ఉపాధ్యాయుల అదనపు విధి. ఇటీవల ఫార్మేటివ్ అసెస్ మెంట్ (FA -4) మార్కుల్ని సర్వర్లలో అప్లోడ్ చేయబోతుంటే మాటి మాటికీ సర్వర్ స్లో అవుతుందని అంటున్నారు టీచర్లు. సర్వర్ పై ఒత్తిడి లేకుండా ఉంటుందని కొంతమంది రాత్రి సమయాన్ని ఎంచుకుంటారు. అయినా కూడా వారికీ సమస్య వస్తోంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు.

తప్పెవరిది..?

నాడు-నేడు పేరుతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోంది. అయితే విద్యా వ్యవస్థకు సంబంధించిన వెబ్ సైట్ల నిర్వహణకోసం, సర్వర్ల సామర్థ్యం పెంచడంకోసం మాత్రం నామమాత్రపు నిధులు విడుదల చేస్తుంటారు. దీనివల్ల బోధనేతర విధులు నిర్వహించే సమయంలో ఉపాధ్యాయులకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు విషయంలో కూడా గతంలో సర్వర్ల సమస్య ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు విద్యార్థుల మార్కులు ఎంటర్ చేయాలంటే చుక్కలు కనపడుతున్నాయి. ఇది ఏ ఒక్కరికో వచ్చిన సమస్య కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్య.

ఒక్కో విద్యార్థి మార్కులు ఎంటర్ చేయాలంటే కనిష్టంగా 5 నిమిషాల సమయం పడుతుంది. సర్వర్ డౌన్ అయితే అప్పటి వరకూ ఎంటర్ చేసిన మార్కుల వివరాలు కూడా కనిపించకుండా పోతాయి. దీంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. సర్వర్ సమస్యలనుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News