పవన్ కల్యాణ్ ప్రజా దర్బార్..

శ్రీకాకుళం జిల్లానుంచి కూడా తమ సమస్యలు చెప్పుకోడానికి బాధితులు మంగళగిరి వరకు రావడం విశేషం. వైసీపీ నాయకులు తమ భూములు కబ్జా చేశారంటూ శ్రీకాకుళం వాసులు కొందరు పవన్ కి ఫిర్యాదు చేశారు.

Advertisement
Update:2024-07-29 20:39 IST

కూటమి ప్రభుత్వం వచ్చాక నాయకులంతా ప్రజా దర్బార్ లు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఓవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు మంత్రి నారా లోకేష్.. టీడీపీ తరపున అర్జీలు స్వీకరిస్తున్నారు, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన కార్యాలయంలో బాధితులను స్వయంగా కలసి అర్జీలు స్వీకరిస్తున్నారు. వీలైనంత మేర అక్కడికక్కడే ఆయా సమస్యలకు పరిష్కారం లభించేలా ఆయన చొరవ తీసుకుంటున్నారు. తాజాగా పార్టీ ఆఫీస్ కి వచ్చిన ప్రజలనుంచి పవన్ అర్జీలు తీసుకున్నారు.


కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు తమను రెగ్యులర్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని కోరారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐదుగురు స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలని కూడా వారు పవన్ కి విజ్ఞప్తి చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లానుంచి కూడా తమ సమస్యలు చెప్పుకోడానికి బాధితులు మంగళగిరి వరకు రావడం విశేషం. వైసీపీ నాయకులు తమ భూములు కబ్జా చేశారంటూ శ్రీకాకుళం ప్రజలు పవన్ కి ఫిర్యాదు చేశారు.

సొంత ఇంటికి సాయం చేయాలని, రేషన్ కార్డులు ఇప్పించాలని, ఒంటరి మహిళ పెన్షన్ ఇప్పించాలని కూడా కొందరు పవన్ కల్యాణ్ కి అర్జీలు ఇచ్చారు. కొందరు వృద్ధులు కూడా తమ సమస్యలను పవన్ కి చెప్పుకున్నారు. వారు ఉన్న చోటకే వెళ్లి డిప్యూటీ సీఎం వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. 

Tags:    
Advertisement

Similar News