పోలీసుల విచారణకు హాజరైన దువ్వాడ శ్రీనివాస్
చంద్రబాబు, పవన్ కల్యాణ్, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు
Advertisement
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా.. టీటీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ నవంబర్ 18న టెక్కలి జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కణితి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ నెల 13న దువ్వాడ శ్రీనివాస్‌కు 41 ఏ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో దువ్వాడ పోలీసుల విచారణకు హాజరయ్యారు.
Advertisement