రఘురామకు అంత కెపాసిటీ ఉందా..?

శుక్రవారం అయితే ఓ 200 ఎంపీలను తీసుకొచ్చే వాళ్ళం అని అన్నారు. మహారాష్ట్ర నుంచి శివసేన, హర్యానా నుండి బీజేపీ ఎంపీలను అమరావతి ఆందోళనలకు మద్దతుగా తీసుకొచ్చే వాడిని అన్నారు.

Advertisement
Update:2022-12-18 10:29 IST

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు మాటలు మామూలుగా లేవు. ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత 'మాటలు కోటలు దాటుతున్నాయ'నే నానుడి వచ్చిందేమో. ఇంతకీ విషయం ఏమిటంటే అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండుతో అమరావతి జేఏసీ నేతల నాయకత్వంలో సుమారు వెయ్యిమంది ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జంతర్ మంతర్ దగ్గర 17, 18, 19 తేదీల్లో నిరసన తెలిపేందుకు ఆందోళనకారులు ప్లాన్ చేశారు.

ఈ నేపథ్యంలోనే మొదటిరోజు వీళ్ళ ఆందోళనలో తిరుగుబాటు ఎంపీ కూడా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం అన్నా, వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనటం అన్నా రాజుగారు చాలా ఉత్సాహంగా ఉంటారు కదా. అందుకే ఆందోళనకారులను ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ 'ఈరోజు శనివారం అయిపోయింది అదే నిన్న శుక్రవారం అయితే ఓ 200 ఎంపీలను తీసుకొచ్చే వాళ్ళం' అని అన్నారు. మహారాష్ట్ర నుంచి శివసేన, హర్యానా నుండి బీజేపీ ఎంపీలను అమరావతి ఆందోళనలకు మద్దతుగా తీసుకొచ్చే వాడిని అన్నారు.

ఇక్కడే ఎంపీ కెపాసిటిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అమరావతికి మద్దతుగా జరిగే ఆందోళనలకు 200 మంది ఎంపీలను తీసుకొచ్చే కెపాసిటీ రాజు గారికి కుందా అనేది ప్రశ్న. ఎందుకంటే ఒక అంశానికి మద్దతుగా 200 మంది ఎంపీలను తీసుకురావటం అంటే మామూలు విషయంకాదు. జాతీయస్ధాయిలో ఎంతో పట్టున్న నేతలకు కూడా ఇంత సామర్థ్యం ఉందా అనేది అనుమానమే. జాతీయస్ధాయిలో అమరావతి అంశం చాలా చిన్నది.

ఇంతచిన్న అంశానికి మద్దతుగా తాను 200 మంది ఎంపీలను తీసుకొచ్చేవాడిని అని ఎంపీ అన్నారంటే తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారనే సెటైర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. జగన్ కు భయపడి ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ప్రతిరోజు రచ్చబండ నిర్వహిస్తున్న ఎంపీకి నిజంగానే అంత కెపాసిటి ఉంటే అసలు ఆగేవారే కాదని నెటిజన్లంటున్నారు. మొత్తానికి శనివారం.. 200 మంది ఎంపీలనే వ్యాఖ్యలు చాలా వైరల్ అయిపోయాయి.

Tags:    
Advertisement

Similar News