తన గడపనే జగన్ చూసుకోలేకపోయారా?

పార్టీ వర్గాలు, ఇంటెలిజెన్స్, ఐప్యాక్ టీం ద్వారా కార్యక్రమం జరుగుతున్న విధానంపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న జగన్‌కు తన గడపలో ఏమి జరుగుతోందో మాత్రం తెలియ‌లేదు. తన గడపలో ఏ్ం జరుగుతోందో తెలుసుకునుంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ తగిలేది కాదు.

Advertisement
Update:2023-03-24 10:52 IST

పార్టీలో ఇప్పుడు ఈ విషయాన్నేసెటైరికల్‌గా చెప్పుకుంటున్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి జనాల నాడిని తెలుసుకునేందుకు, లోపాలను సరిచేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గడపగడపకు మ‌న ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాదాపు ఏడాదిగా ఈ ప్రోగ్రామ్ నడుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేట్లుగా జగన్ అందరి వెంటపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరెలా పాల్గొంటున్నారనే విషయమై జగన్ ఇప్పటికే నాలుగుసార్లు సమీక్షలు చేశారు.

పార్టీ వర్గాలు, ఇంటెలిజెన్స్, ఐప్యాక్ టీం ద్వారా కార్యక్రమం జరుగుతున్న విధానంపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న జగన్‌కు తన గడపలో ఏమి జరుగుతోందో మాత్రం తెలియ‌లేదు. తన గడపలో ఏ్ం జరుగుతోందో తెలుసుకునుంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ తగిలేది కాదు. సొంత బలంతో పాటు టీడీపీ+జనసేన ఎమ్మెల్యేల బలం ఉండి కూడా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలిచారంటే అర్థ‌మేంటి?

విచిత్రం ఏమిటంటే వైసీపీ అభ్యర్థులంద‌రి కన్నా పంచుమర్తికి అత్యధికంగా 23 ఓట్లు రావటం. తనకు ఎంతో స్ట్రాంగ్ మద్దతుదారుడైన కోటంరెడ్డి శ్రీధరరెడ్డి విషయంలో ఏమి జరుగుతోందో జగన్ తెలుసుకోలేకపోయారు. జగన్ మద్దతుదారుల్లో ఒకడిగా ప్రచారంలో ఉన్న కోటంరెడ్డి రెబల్‌గా మారిపోవటమే విచిత్రం. అంటే కోటంరెడ్డి రెబల్‌గా మారుతున్న విషయం జగన్‌కు తెలియ‌లేదు. ఆనం అంటే మొదటి నుండి అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే కాబట్టి జగన్ పట్టించుకోలేదు.

కోటంరెడ్డి రెబల్‌గా మారిన తర్వాతైనా జగన్ మేల్కోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలతో రెగ్యులర్‌గా మాట్లాడాల్సిన జగన్ ఆపని చేయకపోవటమే పెద్ద మైనస్. జగన్‌పై చాలామంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిపోతోందని మీడియాలో వార్తలు, కథనాలు వస్తునే ఉన్నాయి. మీడియాను జగన్ పట్టించుకోకపోయినా ఇంటెలిజెన్స్, ఐ ప్యాక్, పార్టీ వర్గాలంతా ఏం చేస్తున్నాయి. ఒకవేళ వీళ్ళంతా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిపోతోందని చెప్పినా పట్టించుకోలేదంటే అది జగన్ తప్పే అవుతుంది. తన గడపలో ఏమి జరుగుతోందో చూసుకోలేకపోవటం జగన్ ఫెయిల్యూరే అనటంలో సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News