పవన్‌కు ప్రశ్నలు సంధించిన ఆర్జీవీ
ట్విట్టర్ వేదికగా ఆయన పలకరించారు. అందులో స్కిల్ స్కామ్ కేసులో పవన్‌కు ఏమి అర్థమైందో.. నా ప్రశ్నలకు ఒక్క పదంలో జవాబులు ఇవ్వండి.. అంటూ పేర్కొన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పలు ప్రశ్నలు సంధించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టును తప్పుపట్టిన పవన్‌ను సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన పలకరించారు. అందులో స్కిల్ స్కామ్ కేసులో పవన్‌కు ఏమి అర్థమైందో.. నా ప్రశ్నలకు ఒక్క పదంలో జవాబులు ఇవ్వండి.. అంటూ పేర్కొన్నారు.
ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే..
♦ సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో అసలు స్కిల్ స్కామ్ జరిగిందా? లేదా?
♦ ఒకవేళ స్కామ్ జరిగితే.. సీబీఎన్ (చంద్రబాబు)కు తెలియకుండా జరిగిందా?
♦ రూ.300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా, అధికారులు చెబుతున్నా వినకుండా విడుదల చేశారా? లేదా?
♦ అప్పటి ప్రభుత్వ అధినేతగా చంద్రబాబుకు స్కామ్ జరిగిన తర్వాత విషయం తెలిసి ఉంటే వెంటనే దానిపై చర్యలు తీసుకోకపోవడం సరైనదేనా?
♦ దర్యాప్తులో సేకరించిన సమాచారాన్ని బట్టి ఎఫ్ఐఆర్‌లో ఎప్పుడైనా ఎవరి పేరైనా చేర్చవచ్చన్న విషయం మీకు తెలీదా?
♦ సీఐడీ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నమ్మి న్యాయమూర్తి బెయిల్ ఇవ్వకపోవడం తప్పా?
♦ సెక్షన్ 409 వర్తిస్తుందని చెప్పి రిమాండ్ విధించిన న్యాయమూర్తి అవినీతిపరురాలా?
♦ నాయకులంటే 40 ఏళ్లు బ్యాక్ గ్రౌండ్‌ను బట్టి కాదు.. వాళ్లు చేసే పనులను బట్టి అనే విషయం మీకు తెలీదా?
అంటూ ఆర్జీవీ ప్రశ్నలను పోస్ట్ చేశారు. స్కిల్ స్కామ్ కేసులో ఏమి అర్థమైందో, దానిలోని తప్పులేంటో చెబుతూ పవన్ కెమెరావైపు చూస్తూ వీడియోను విడుదల చేయాలని ఈ సందర్భంగా వర్మ కోరారు.
ఏమీ తెలియకపోయినా..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయడాన్ని పవన్ కల్యాణ్ తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఆయన హుటాహుటిన విజయవాడకు తరలివచ్చేందుకు నానా హైరానా పడి హంగామా సృష్టించిన విషయమూ తెలిసిందే. ఇంతకీ ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై పవన్ కల్యాణ్‌కు ఏం తెలుసు? ఈ కుంభకోణం గురించి పవన్‌కు అవగాహన ఉందా? సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టిన అంశాలేమిటో ఆయనకు తెలుసా? ఈ విషయాలన్నీ తెలుసుకోకుండానే అవినీతి జరిగిందో లేదో క్లారిటీ లేకుండానే గుడ్డిగా పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సపోర్ట్ చేయడాన్ని బట్టి చూస్తే.. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా కంటే.. చంద్రబాబు ప్యాకేజీ కోసం పనిచేసే వ్యక్తిగానే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం సోషల్‌మీడియాలో సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పుడు రామ్‌గోపాల్‌వర్మ ట్వీట్ చేసిన ప్రశ్నల ఉద్దేశం కూడా అదేనని అర్థమవుతోంది.