పాదయాత్రలో నారా లోకేష్ కు గుండె నొప్పి వస్తుంది.. వర్మ సెటైరికల్ ట్వీట్
వర్మ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. డబ్బు తీసుకుని వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తివి నువ్వు అని మండిపడుతున్నారు.
ఎలాగైనా తనను తాను లీడర్‌గా మలచుకునేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు నాలుగు వేల కిలోమీటర్లు సాగనున్న ఈ పాదయాత్ర ఇటీవల కుప్పం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రకు జనం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదనే టాక్ ఉంది.
దీనిపై వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు జన సమీకరణ చేపట్టడంలో విఫలం అయ్యారని టీడీపీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు కూడా జన సమీకరణ చేపట్టాలని ఓ నాయకుడితో మాట్లాడుతున్న ఆడియో కూడా లీకవ్వడం కూడా కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నారా లోకేష్ పాదయాత్రపై ట్విట్టర్ వేదికగా ఓ సెటైరికల్ ట్వీట్ చేశాడు. 'పాదయాత్రలో జనాలు లేకపోవడం మూలాన నారా లోకేష్ టెర్రిఫిక్ ఐడియా చేయొచ్చు. చెస్ట్ నొప్పో, లిగమెంట్ తెగిందనో చెప్పి.. డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నడక కంటిన్యూ చేయవద్దు అని సర్టిఫికెట్ తీసుకొని పాదయాత్ర ఆపేస్తే చంద్రబాబు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదేనా ఉచిత చచ్చు సలహా ' అని వర్మ వివాదాస్పద కామెంట్స్ చేశారు. వర్మ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. డబ్బు తీసుకుని వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తివి నువ్వు అని మండిపడుతున్నారు.