పవన్ కు మోడీ రివర్స్ పంచ్ ఇచ్చారా..?
టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న పవన్ ఆశలపై మోడీ నీళ్ళు చల్లేసినట్లు తెలుస్తోంది. బీజేపీ, జనసేనలు చిత్తశుద్ధితో పోరాటాలు చేయాలని మోడీ సూచించారట.
ముందునుంచి అనుమానిస్తున్నట్లే జరిగిందా..? నరేంద్రమోడీతో జరిగిన భేటీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదింపాలంటే అన్నీ పార్టీలను కలుపుకుని వెళ్ళాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టిగా చెప్పారట. అన్నీపార్టీలు అంటే ఇక్కడ పవన్ ఉద్దేశ్యం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అని మాత్రమే అని అందరికీ తెలుసు. పోరాటాలు, ప్రణాళికలు, పొత్తులపై పవన్ వివరించిన తర్వాత మోడీ రివర్స్ పంచ్ విసిరినట్లు సమాచారం.
టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న పవన్ ఆశలపై మోడీ నీళ్ళు చల్లేసినట్లు తెలుస్తోంది. బీజేపీ, జనసేనలు చిత్తశుద్ధితో పోరాటాలు చేయాలని మోడీ సూచించారట. ఇప్పటివరకు రెండుపార్టీల మధ్య ఉన్న గ్యాప్ ను పూడ్చుకుని ఇకనుంచి కలిసికట్టుగా పోరాటాలు చేయాలని చెప్పారట. పొత్తుల గురించి ఇప్పుడే చర్చించాల్సిన అవసరం లేదని ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా ఉన్న విషయాన్ని పవన్ కు మోడీ గుర్తుచేశారని సమాచారం.
పవన్ అడిగినట్లు రోడ్ మ్యాప్ తొందరలోనే అందిస్తామని కూడా మోడీ హామీ ఇచ్చారట. రెండు పార్టీలు కలిసి పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని బీజేపీ నేతలతో కూడా గట్టిగా చెబుతానని అన్నారట. ఇప్పటివరకు రెండు పార్టీలు ఎవరికి వాళ్ళుగా కార్యక్రమాలు చేయటం వల్లే జనాల్లో పలుచనైపోయిన విషయం తనకు తెలుసని మోడీ అన్నారు. రాజకీయంగా ఇరు పార్టీలు చేయాల్సిన పోరాటాలపై రెండుపార్టీల నేతలు సమావేశమై నిర్ణయించుకోమని మోడీ సలహా ఇచ్చారట.
పవన్ కు మోడీ చేసిన హితోపదేశం విన్న తర్వాత పవన్ ఆశలపై నీళ్ళు చల్లినట్లయిపోయింది. ఇద్దరి మధ్య జరిగిన భేటీలో చర్చించిన అంశాలు లీకైన వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడుతో పొత్తుకు మోడీ ఏమాత్రం సుముఖంగా లేరని అర్థమవుతోంది. దీనికి నిదర్శనం ఏమిటంటే.. వీళ్ళిద్దరి భేటీపై ఎల్లోమీడియా ఎలాంటి కథనాలు ఇవ్వకపోవటమే. చంద్రబాబును కలుపుకుని వెళ్ళటానికి పవన్ చేసిన ప్రయత్నాలను మోడీ అసలు పట్టించుకోలేదన్న విషయం స్పష్టమవుతోంది. మరిప్పుడు పవన్ ఏమిచేస్తారు..? మోడీ చెప్పినట్లు ఇష్టం లేకపోయినా బీజేపీతో కలిసుంటారా..? లేకపోతే బీజేపీతో కటీఫ్ చెప్పేసి టీడీపీతో చేరేంత ధైర్యంచేస్తారా..? అన్నదే ఇపుడు పెద్ద సమస్య.