చంద్రబాబు ప్లాన్ రివర్స్ కొట్టిందా..?

పవన్ను చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తున్న చంద్రబాబు ప్లాన్లు బీజేపీ ముందు వర్కువుట్ కాలేదట. ఆరు ఎంపీలు, ఆరు అసెంబ్లీ సీట్లు మాత్రమే బీజేపీకి టీడీపీ ఇవ్వబోతోందని ఢిల్లీలో లీకులిచ్చి వార్తలు రాయించుకున్నారు.

Advertisement
Update:2024-03-14 12:03 IST

పొత్తుల పేరుతో చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్ పూర్తిగా వర్కవుటైనట్లు లేదు. పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు అనుకున్నట్లే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆడిన విషయం అందరూ చూసిందే. 24 సీట్లే ఇస్తామని చంద్రబాబు అంటే ఓకే అన్నారు. కాదు కాదు, 21 సీట్లే ఇస్తామన్నా పవన్ ఏమీ మాట్లాడలేదు. మూడు ఎంపీ సీట్లలో పోటీచేయమంటే సరే అన్న పవన్ తర్వాత రెండే కేటాయిస్తున్నట్లు చంద్రబాబు చెప్పినా నోరెత్తలేదు.

పవన్ను చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తున్న చంద్రబాబు ప్లాన్లు బీజేపీ ముందు వర్కువుట్ కాలేదట. ఆరు ఎంపీలు, ఆరు అసెంబ్లీ సీట్లు మాత్రమే బీజేపీకి టీడీపీ ఇవ్వబోతోందని ఢిల్లీలో లీకులిచ్చి వార్తలు రాయించుకున్నారు. అయితే ఎంపీలు ఆరే అయినా, అసెంబ్లీలు మాత్రం పది వదులుకోవాల్సొచ్చింది. పైగా సీట్ల సర్దుబాటు చర్చలు కూడా ఢిల్లీలో కాకుండా విజయవాడలోనే జరిగాయి. అదికూడా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి లేకుండానే. పొత్తుల విషయంలో కానీ, సీట్ల సర్దుబాటులో కానీ, పురందేశ్వరిని బీజేపీ అగ్రనేతలు ఎక్కడా ఇన్వాల్వ్ చేయలేదు.

అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి పురందేశ్వరి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అందుకనే సీట్ల సర్దుబాటు కోసం ప్రత్యేకంగా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, పాండాను పంపి పూర్తిచేయించారు. అలాగే చంద్రబాబు మద్దతుదారులైన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళకి కూడా సీట్ల సర్దుబాటులో పాల్గొనే అవకాశం ఇవ్వలేదు. ఇక పోటీ విషయానికి వస్తే సీఎం రమేష్, సుజనా, పురందేశ్వరి లాంటి వాళ్ళు ఎంపీలుగా పోటీకి రెడీ అయ్యారు.

అయితే అగ్రనేతలు మాత్రం ఏ విషయం చెప్పలేదట. సుజనా, సీఎం రమేష్, రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళకి టికెట్లిస్తే ఊరుకునేదిలేదని సీనియర్లలో చాలామంది నేతలు ఇప్పుడు అడ్డం తిరిగారు. అలాగే పురందేశ్వరిని కూడా ఎంపీగా కాకుండా అసెంబ్లీకి పోటీచేయమని అగ్రనేతలు చెబుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. చెప్పుకోవటానికి వీళ్ళంతా బీజేపీ నేతలే అయినా అందరూ చంద్రబాబు మనుషులే అన్న ఆరోపణలు తెలిసిందే. మొదటినుండి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను కాదని కొత్తవారికి టికెట్లిస్తే పనిచేసేదిలేదని సీనియర్లు కొందరు అగ్రనేతలకు స్పష్టంగా చెప్పారట. ఇదే విషయమై శుక్రవారం మీటింగు కూడా జరగబోతోందని సమాచారం. జరుగుతున్న పరిణామాలతో చంద్రబాబు ప్లాన్ బీజేపీలో వర్కవుట్ కాలేదనే టాక్ పెరిగిపోతోంది.

Tags:    
Advertisement

Similar News