డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మిస్సింగ్!
రామోజీ సంస్మరణకు సంబంధించి తెలుగుదేశం అనుకూల పత్రికలకు ఫుల్ పేజ్ యాడ్స్ కూడా ఇచ్చింది సమాచార శాఖ. అయితే ఈ యాడ్స్‌లో కేవలం ముఖ్య అతిథిగా చంద్రబాబు పేరు, ఫొటో మాత్రమే కనిపించింది.
ఈనాడు గ్రూప్స్ అధినేత, చంద్రబాబుకు రాజగురువుగా పేరున్న రామోజీ రావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం విజయవాడ సమీపంలోని కానూరులో భారీగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులతో కమిటీ కూడా నియమించింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది.
రామోజీ సంస్మరణకు సంబంధించి తెలుగుదేశం అనుకూల పత్రికలకు ఫుల్ పేజ్ యాడ్స్ కూడా ఇచ్చింది సమాచార శాఖ. అయితే ఈ యాడ్స్‌లో కేవలం ముఖ్య అతిథిగా చంద్రబాబు పేరు, ఫొటో మాత్రమే కనిపించింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఫొటో వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నిజానికి రామోజీరావు సంస్మరణ సభ కార్యక్రమానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్‌కల్యాణ్ కూడా ముఖ్య అతిథిగా ఉన్నారు. కానీ, పేపర్ ప్రకటనల్లో ఎక్కడా కూడా ఆయన ఫొటో కానీ, పేరు కానీ కనిపించలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేదా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి పవన్‌కల్యాణ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం తెలుగుదేశం శ్రేణులకు ఇష్టం లేదు. చంద్రబాబుకు కూడా ఇష్టం లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదు. భవిష్యత్తులో ఏనాటికైనా పవన్‌కల్యాణ్‌తో తమకు ముప్పు తప్పదని తెలుగుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే క్రమంగా పవన్‌కు ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాల్లో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాణస్వీకారం రోజు ప్రధాని మోడీ పవన్‌కల్యాణ్, చిరంజీవిలతో ప్రత్యేకంగా ప్రజలకు అభివాదం చేసే సందర్భంలో చంద్రబాబు ముఖంలో ఆ ఆందోళన స్పష్టంగా కనిపించింది.