తిరుమలలో డిక్లరేషన్‌ రూల్‌ జగన్‌కూ వర్తిస్తుంది: షర్మిల

లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు ఏపీ పీసీసీ చీఫ్‌ వెల్లడి

Advertisement
Update:2024-09-27 14:35 IST

జగన్‌ ప్రభుత్వ హయాంలోనే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. లడ్డూలకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్‌ నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ తప్పు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షురాలిగా తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు తెలిపారు. లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరామని చెప్పారు.మరోవైపు జగన్‌ తిరుమల పర్యటనలో డిక్లరేషన్‌ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా స్పందిస్తూ.. డిక్లరేషన్‌ అందరికీ వర్తిస్తుంది అన్నారు. రూల్‌ అప్లైడ్‌ ఫర్‌ ఆల్‌ పీపుల్‌ అని వ్యాఖ్యానించారు. 

డిక్లరేషన్‌పై జగన్‌ ఎందుకు సంతకం పెట్టాలి? ఆయన పని చేయరు. సంతకం చేయకుండానే తిరుమలకు వెళతాం. శ్రీవారిని దర్శించుకుంటాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు అని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గానే షర్మిల వ్యాఖ్యానించినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

Tags:    
Advertisement

Similar News