ఎమ్మెల్యేల్లో పెరిగిపోతున్న టెన్షన్

ఈ టెన్షన్ కు కారణం ఏమిటంటే డిసెంబర్ 4వ తేదీన గడప గడపకు మ‌న‌ ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫైనల్ రివ్యూ చేయబోతున్నారు.

Advertisement
Update:2022-11-09 11:40 IST

డిసెంబర్ నెల దగ్గరపడుతున్నకొద్దీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లు సమాచారం. ఈ టెన్షన్ కు కారణం ఏమిటంటే డిసెంబర్ 4వ తేదీన గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంపై జగన్మోహన్ రెడ్డి ఫైనల్ రివ్యూ చేయబోతున్నారు. ఇదే కార్యక్రమంపై ఇప్పటికి జగన్ మూడు సార్లు రివ్యూ చేశారు. కార్యక్రమంలో పాల్గొనని మంత్రులు, ఎమ్మెల్యేలకు మొదట్లో గట్టిగా చెప్పారు. రెండోసారి ఫీడ్ బ్యాక్‌లో కూడా తీరు మార్చుకోని వాళ్ళకి అందరి ముందు గట్టిగానే క్లాసు పీకారు.

ఇక మూడోసారి జరిగిన సమీక్షలో అయితే పేరుపేరును ప్రస్తావించి పద్దతి మార్చుకోకపోతే టికెట్ ఇచ్చేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడే డిసెంబర్ 4వ తేదీన చివరిసారి రివ్యూ చేస్తానని తర్వాత ఎవరికీ వార్నింగులు కూడా ఇచ్చేదిలేదని చెప్పేశారు. మూడో సమీక్షకు నాలుగో సమీక్షకు మధ్య సమయంలో పద్దతి మార్చుకుంటే అందరికీ మంచిదని లేకపోతే టికెట్ రాకపోతే తనను నిందించవద్దని కూడా అప్పుడే చెప్పేశారు. ఆ నాలుగో సమీక్షే డిసెంబర్ 4వ తేదీన జరగబోతోంది.

ఇప్పటి వరకు అందిన ఫీడ్ బ్యాక్ ప్రకారం, సర్వే రిపోర్టుల ఆధారంగా రాబోయే ఎన్నికల్లో వివిధ కారణాలతో కనీసం ఓ 30 మందికి టికెట్లు దక్కేది అనుమానమే అనే ప్రచారం పార్టీలో బాగా జరుగుతోంది. వివిధ కారణాలు అంటే అందులో గడప గడపకు మ‌న‌ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనకపోవటం చాలా కీలకమైనది. జనాల నాడి తెలుసుకోవటం, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను అందరికీ వివరించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమే గడప గడపకు మ‌న‌ ప్రభుత్వం.

ఇందుకనే దీన్ని జగన్ అంత్యత ప్రతిష్టగా తీసుకున్నారు. తాను ఇంత ప్రతిష్టగా తీసుకున్న కార్యక్రమంలో కూడా మంత్రులు, ఎమ్మెల్కేలు పాల్గొనకపోతే అది జగన్‌కు ప్రిస్టేజ్ సమస్యగా మారింది. అందుకనే ఇదే విషయాన్ని జగన్ పదే పదే ప్రస్తావిస్తున్నది. ఇంతచెప్పినా కూడా ఎవరైనా లైట్‌గా తీసుకుంటే అదివాళ్ళ ఖర్మని అనుకోవాల్సిందే. ఎందుకంటే చెప్పిన మాట వినని వాళ్ళ విషయంలో జగన్ బాగా కఠినంగా ఉంటారని అందరికీ తెలిసిందే. అందుకనే అందరిలోనూ డిసెంబర్ 4 టెన్షన్ పెరిగిపోతోంది.

Tags:    
Advertisement

Similar News