''భారతిపే''కి కౌంటర్.. బ్రహ్మణి మిల్క్

సోషల్ మీడియాలో నారా బ్రహ్మణిని టార్గెట్‌ చేశారు. భారతి పేకు కౌంటర్‌గా బ్రహ్మణి మిల్క్‌ పేరుతో క్యూఆర్‌ కోడ్‌ను తయారు చేశారు. స్కాన్ దిస్‌ కోడ్ టూ మేక్ ద బ్రహ్మణి పే ఫర్ బ్రహ్మణి మిల్క్ అంటూ పోస్టర్లు వేశారు.

Advertisement
Update:2022-09-27 14:00 IST

ఏపీ రాజకీయాల్లో హద్దులు చెరిగిపోతున్నాయి. భర్త రాజకీయాల్లో ఉంటే భార్యలూ ట్రోల్స్‌కు సిద్ధపడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు మీద వైసీపీ వారు పోస్టర్లు అతికించారన్న ఉద్దేశంతో టీడీపీ వారు వైఎస్‌ భారతిపై.. భారతిపే అంటూ పోస్టర్లు వేశారు. దానికి కౌంటర్‌గా వైసీపీ వాళ్లు రంగంలోకి దిగారు.

సోషల్ మీడియాలో నారా బ్రహ్మణిని టార్గెట్‌ చేశారు. భారతి పేకు కౌంటర్‌గా బ్రహ్మణి మిల్క్‌ పేరుతో క్యూఆర్‌ కోడ్‌ను తయారు చేశారు. స్కాన్ దిస్‌ కోడ్ టూ మేక్ ద బ్రహ్మణి పే ఫర్ బ్రహ్మణి మిల్క్ అంటూ పోస్టర్లు వేశారు.

భారతి ఫోటోలో టీడీపీ వారు కోడ్ తయారు చేయగా.. బ్రహ్మణి పేరుతో వైసీపీ వారే కోడ్ తయారు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశమే హాట్‌ టాపిక్‌గా మారింది.

Tags:    
Advertisement

Similar News