అబ్బాయ్ - బాబాయ్ మ‌ధ్య‌ ప‌త్తికొండ పంచాయితీ

అన్ని నివేదిక‌లు ముందు పెట్టుకుని, ప‌రిశీల‌కుల అభిప్రాయం తెలుసుకున్నాక చంద్ర‌బాబు కేఈ ప్రభాకర్‌, పత్తికొండ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబుల‌తో మాట్లాడారు.

Advertisement
Update:2023-07-28 08:47 IST

ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం సీటు పంచాయితీ అబ్బాయ్ కేఈ శ్యాంబాబు, బాబాయ్ కేఈ ప్ర‌భాక‌ర్ మ‌ధ్య పీట‌ముడి బిగిసింది. పత్తికొండ నియోజకవర్గం ముఖ్య నాయకులతో అధినేత చంద్రబాబు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. స‌మీక్ష సంద‌ర్భంగా ప‌త్తికొండ‌లో గెలుపు గుర్రాన్ని త‌న‌కి ఇవ్వాల‌ని చంద్రబాబు సూచించారు. ఎన్నికల బరిలో దిగేది అబ్బాయో, బాబాయో మీరే తేల్చుకోవాల‌ని వారి కోర్టులోకి బంతి నెట్టేశారు బాబు. కేఈ కృష్ణ‌మూర్తికి త‌న‌యుడా, త‌మ్ముడా తేల్చాల్సిన బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మీ కుటుంబంలో ఎవ‌రు అభ్య‌ర్థో డిసైడ్ చేసి, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకుంటే సునాయాసంగా విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని చంద్ర‌బాబు సూచించారు.

అన్ని నివేదిక‌లు ముందు పెట్టుకుని, ప‌రిశీల‌కుల అభిప్రాయం తెలుసుకున్నాక చంద్ర‌బాబు కేఈ ప్రభాకర్‌, పత్తికొండ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబుల‌తో మాట్లాడారు. ఇద్దరూ తమకే టికెట్‌ ఇవ్వాలని అధినేత‌కి తేల్చి చెప్పేశారు. కాదు, కూడ‌దు అనుకుని పత్తికొండ శ్యాంబాబుకు ఇస్తే.. డోన్‌, ఆలూరులలో ఏదో ఒక టికెట్ త‌న‌కి ఇవ్వాల‌ని కేఈ ప్రభాకర్ డిమాండ్ చేయ‌డంతో ఎటూ తేల్చ‌కుండానే స‌మీక్ష ముగించారు. శ్యాంబాబు, ప్ర‌భాక‌ర్ ల‌తో మాట్లాడి కేఈ కృష్ణ‌మూర్తి ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని త‌న‌కి తెలియ‌జేయాల‌ని బాబు సూచించారు. కేఈ కుటుంబ సభ్యులు సమావేశమై ఎవ‌రికి ప‌త్తికొండ కేటాయించాలో డిసైడ్ చేసుకునే అవ‌కాశం ఉంది.

కేఈ ప్ర‌భాక‌ర్ అడుగుతున్న డోన్, ఆలూరుల‌లో టీడీపీ టికెట్ ఇచ్చే అవ‌కాశ‌మే లేదు. డోన్ కి సుబ్బారెడ్డిని ఆల్రెడీ ఇన్చార్జిగా ప్ర‌క‌టించారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే ఇటీవ‌ల యువ‌గ‌ళం పాద‌యాత్ర సాగింది. ఆలూరులో కోట్ల సుజాత‌మ్మ ఉండ‌నే ఉన్నారు. ఈ రెండు స్థానాల నుంచి ప్ర‌భాక‌ర్‌కి ఎటువంటి అవ‌కాశంలేద‌ని, కేఈ కుటుంబానికి ఒక్క సీటు ఇస్తున్నామ‌ని, ప‌త్తికొండ‌లోనే అబ్బాయా! బాబాయా! తేల్చుకోవాల‌ని అన్యాప‌దేశంగా అధినేత కేఈ కుటుంబానికి హింట్ ఇచ్చేశారు.

Tags:    
Advertisement

Similar News