మాజీ మంత్రి విడదల రజనిపై పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు
వైసీపీ నేత,మాజీ మంత్రి విడదల రజనిపై టీడీపీ చిలకలూరిపేట అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు గుంటూరు ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనిపై టీడీపీ చిలకలూరిపేట అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు గుంటూరు ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టినట్టు తప్పుడు కేసులతో వేధించారని, పోలీస్ స్టేషన్ లో తనను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశారని పిల్లి కోటేశ్వరరావు తన ఫిర్యాదులో ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఏపీలో ప్రస్తుతం అధికార కూటమి-ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. నిత్యం ఏదో ఒక టాపిక్ పై వాదనలు-ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమను దారుణంగా వేదించి తీవ్రంగా కొట్టారని ఫిర్యాదు చేశాడు బాధితుడు. కొట్టి చిత్రహింసలకు గురి చేసిన ఆ దృశ్యాలను లైవ్ లో చూస్తూ.. నాటి స్థానిక శాసనసభ్యురాలు, మాజీ మంత్రి విడదల రజనీ పైశాచిక ఆనందం పొందారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. టీటీడీ కోసం పని చేస్తే చంపేస్తామని బెదిరించారు. విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని బాధితులు కోరారు