2034లో నేను చనిపోతా, ఈ శనివారంజరిగే నా మరణదిన వేడుకలకు రండి... ఏపీ మాజీ మంత్రి ఆహ్వానం
ఏపీ మాజీ మంత్రి పాలేటి రామారావు తన అనుచరులకు, అభిమానులకు, బంధువులకు పంపిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు చర్చానీయాంశమైంది. చీరాల ఐఎంఏ హాల్ లో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే తన మరణదిన వేడుకలకు రమ్మంటూ ఆయన పంపించిన ఆహ్వాన పత్రిక చూసి ఆహ్వానితులు షాకవుతున్నారు.
పుట్టినరోజు వేడుకలు, పెళ్ళిరోజు వేడుకలు చూసి ఉంటారు కదా ! ఆ వేడుకలను పెద్ద ఎత్తున చేయాలనుకునే వారు ఆహ్వాన పత్రికలు వేసి మరి దగ్గరివారిని ఆహ్వానిస్తారు. అయితే ఇప్పుడు మరో రకమైన ఆహ్వాన పత్రిక ఆంధ్రప్రదేశ్ లోని చీరాలలో సంచలనం సృష్టిస్తోంది.
ఏపీ మాజీ మంత్రి పాలేటి రామారావు తన అనుచరులకు, అభిమానులకు, బంధువులకు పంపిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు చర్చానీయాంశమైంది. చీరాల ఐఎంఏ హాల్ లో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే తన మరణదిన వేడుకలకు రమ్మంటూ ఆయన పంపించిన ఆహ్వాన పత్రిక చూసి ఆహ్వానితులు షాకవుతున్నారు.
ఆహ్వాన పత్రికలో ఓ లేఖ కూడా ఉంది తాను ఎందుకిలా మరణ దిన వేడుకలను జరుపుకుంటున్నానో వివరించారా మాజీ మంత్రి
''ఏటా జరుపుకునే పుట్టినరోజు వేడుకలు అర్థరహితమని తెలుసుకున్నా.. అందుకే ఇకపై మరణదిన వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నా. ఇన్నాళ్ల నా జీవితాన్ని పరిశీలించుకున్నాక నా మరణ సంవత్సరాన్ని 2034 గా నిర్ణయించుకున్నా. దానికి ఇంకా 12 సంవత్సరాలు ఉంది. ఇప్పటి నుంచి ప్రతీ సంవత్సరం మరణదిన వేడుకలు జరుపుకుంటాను. ఆ వేడుకలకు మీరు హాజరై, నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా'' అంటూ రామారావు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.
తన మరణ సమయాన్ని తానే నిర్ణయించుకోవడం, ప్రతీ సంవత్సరం ఆ రోజునాడు వేడుకలు జరుపుకోవడం వింతగా ఉందంటూ చీరాలవాసులు అంటున్నారు.
కాగా, ప్రకాశం జిల్లాలో పాలేటి రామారావు సీనియర్ రాజకీయ నేత. ఆయన 1994, 1999లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.. అంతేకాదు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2004లో టీడీపీ నుంచి పోటీ చేసి కొణిజేటి రోశయ్య చేతిలో ఓడారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీలో చేరారు.. 2019 ఎన్నికల కొనసాగిన ఆయన.. చీరాల ఎమ్మెల్యే బలరాంతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు.