కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే : మాజీ మంత్రి కాకాణి

జమిలి ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే అధికారంలో ఉంటుందని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి తెలిపారు

Advertisement
Update:2024-10-15 17:07 IST

జమిలి ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే అధికారంలో ఉంటుందని ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వ అధికారులు కూటమి నేతల మాటలు వింటే అధికారులకు ఇబ్బందులకు తప్పవని కాకాణి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని ఆయన అన్నారు. 90 శాతం మద్యం దుకాణాలకు టీడీపీ నేతలకే దక్కాయని మాజీ మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇసుక, గ్రానైట్‌, విద్య, వైద్యంలో సిండికేట్‌ రాజ్యం కొనసాగుతోందని.. యథేచ్ఛగా దోపిడీ జరుగుతుందని ఆరోపించారు.

ముందస్తు ప్రణాళికలతో దోచుకోవడంలో చంద్రబాబు నేర్పరి అని ఎద్దేవా చేశారు. ఎల్లో బ్యాచ్‌ బాగుకోసమే మద్యం పాలసీని ప్రకటించారని అన్నారు. ఇప్పుడు వైన్‌ షాపుల కేటాయింపు తర్వాత అదే తేటతెల్లమయ్యిందని చెప్పారు. లిక్కర్‌ షాపుల కేటాయింపులో సీఎం చంద్రబాబు మూడంచెల దోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని కాకాణి విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలో బెల్ట్‌ షాపులతో కింది స్థాయి నాయకులు దోచుకుంటారని ఆరోపించారు. 

Tags:    
Advertisement

Similar News