ఫిబ్రవరి 27.. జగన్ ఏం చేయబోతున్నారు.?
ఇప్పటికే వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలు పెద్దఎత్తున సక్సెస్ అయ్యాయి. మరో సిద్దం సభకు వేదిక కూడా ఫైనల్ అయింది.
ఇప్పటికే సిద్ధం సభలతో ప్రజల్లోకి వెళ్తున్న వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి.. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కొద్దీ మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయి కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న తాడేపల్లి CK కన్వెన్షన్ ఈ మీటింగ్‌కు వేదిక కానుంది.
ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ మండల నాయకులు, 175 నియోజకవర్గాల నాయకులు హాజరుకానున్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్‌లతో సీఎం జగన్ సమావేశం అవుతారు. ఎన్నికల నిర్వహణ, కార్యాచరణపై శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఇప్పటికే వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలు పెద్దఎత్తున సక్సెస్ అయ్యాయి. మరో సిద్దం సభకు వేదిక కూడా ఫైనల్ అయింది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడు సభకు మించి జనాన్ని తరలించేందుకు వైసీపీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. ఈ సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల జనం హాజరుకానున్నారు.