పెళ్లి, విడాకులు, అక్రమ సంబంధాలు.. పవన్ పై జగన్ ఘాటు వ్యాఖ్యలు
"బాబుగారి వాలంటీర్, బాబుగారి దత్తపుత్రుడు అమ్మాయిలను లోబరచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అమ్మాయిలను లోబరచుకుని, నాలుగేళ్లు కాపురం చేసి, వదిలేయడం, మళ్లీ పెళ్లి, మళ్లీ వదిలేయడం, ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం.. ఇదీ ఆయన క్యారెక్టర్." అంటూ పవన్ ని విమర్శించారు జగన్.
ఇప్పటి వరకూ దుష్టచతుష్టయం అంటూ, నాలుగు పెళ్లిళ్లు, నలుగురు పెళ్లాలు అంటూ కాస్త లైటర్ వేలో వెళ్లిన సీఎం జగన్.. ఈసారి మాత్రం పవన్ కల్యాణ్ పై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి నేతన్న నేస్తం సభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాలంటీర్ల క్యారెక్టర్ ను తప్పుబట్టిన పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ఇదీ అంటూ మండిపడ్డారు జగన్.
వాలంటీర్లను తప్పుబడుతున్న పవన్ కల్యాణ్ పదేళ్లుగా చంద్రబాబు దగ్గర వాలంటీర్ గా పనిచేస్తున్నారని అన్నారు జగన్. "బాబుగారి వాలంటీర్, బాబుగారి దత్తపుత్రుడు అమ్మాయిలను లోబరచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అమ్మాయిలను లోబరచుకుని, నాలుగేళ్లు కాపురం చేసి, వదిలేయడం, మళ్లీ పెళ్లి, మళ్లీ వదిలేయడం, ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం.. ఇదీ ఆయన క్యారెక్టర్." అంటూ పవన్ ని విమర్శించారు జగన్.
పట్టపగలే మందుతాగి 10మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కన డ్యాన్స్ లు చేసేవాడు కూడా మన వాలంటీర్లను తప్పుబడుతున్నాడని, యూట్యూబ్ లో చూస్తే నిస్సిగ్గుగా అతడు చేసిన డ్యాన్స్ లు కనిపిస్తాయని పరోక్షంగా లోకేష్ పై కామెంట్లు చేశారు జగన్.
అమ్మాయి కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి, కడుపైనా చేయాలని ఇంకో దౌర్భాగ్యుడు అంటాడని.. బాలకృష్ణకు చురకలంటించారు. ఇక అన్ స్టాపబుల్ షో లో చంద్రబాబు, బాలకృష్ణ ఇంటర్వ్యూ గురించి కూడా ప్రస్తావించారు జగన్. 75 ఏళ్ల వయసొచ్చినా చంద్రబాబుకి సిగ్గులేదని, బావా నువ్వు సినిమాల్లోనే చేశావు, నేను నిజ జీవితంలో చేశానంటూ చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.
ఏపీలో 2.6 లక్షలమంది వాలంటీర్లు సేవలందిస్తున్నారని. ఇందులో 60శాతం మంది చెల్లెమ్మలు ఉన్నారని, అందరూ చదువుకున్న సంస్కారవంతులని కితాబిచ్చారు సీఎం జగన్. మంచి చేస్తున్న వారిని సంస్కారం ఉన్న ఎవరు అవమానించరన్నారు. సంస్కారం కోల్పోయిన వారే వారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆ తప్పుడు మాటలకి స్క్రిప్ట్ రామోజీ రావు ఇస్తే, నిర్మాత చంద్రబాబు అని, నటన అంతా దత్తపుత్రుడిదని అన్నారు. మహిళల అక్రమ రవాణా అంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్.