కూటమి కుట్రలు.. జగన్ షాకింగ్ కామెంట్స్
వైసీపీ నేతల ఫిర్యాదులను చూసి చూడనట్లు వదిలేస్తున్న ఈసీ.. తెలుగుదేశం నేతలు చేస్తున్న ఫిర్యాదులను మాత్రం పరిగణలోకి తీసుకుంటోంది.
ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్రంలోని బీజేపీని అడ్డుపెట్టుకుని చంద్రబాబు కుట్రలకు తెరలేపాడు. సంక్షేమ పథకాలను ఆపడంతో పాటు తమకు నచ్చని అధికారులను ఇష్టారీతిన బదిలీ చేయిస్తున్నారనే ఆరోపణలు జోరందుకున్నాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు చంద్రబాబుకు, ఆయన పార్టీకి చావో, రేవో తేల్చేవి. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త కాదు.. ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఎంతకైనా దిగజారుతాడనేది తెలిసిన విషయమే.
తాజాగా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోందన్నారు. ఇందుకు ఎన్నికల కమిషన్ తీరు కూడా ఓ కారణం. వైసీపీ నేతల ఫిర్యాదులను చూసి చూడనట్లు వదిలేస్తున్న ఈసీ.. తెలుగుదేశం నేతలు చేస్తున్న ఫిర్యాదులను మాత్రం పరిగణలోకి తీసుకుంటోంది. ఇక తెలంగాణలో రైతుబంధు పంపిణీకి అనుమతించిన ఈసీ.. ఏపీలో మాత్రం విద్యాదీవెన లాంటి పథకాల అమలుకు నో చెప్పింది. ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలకు బ్రేకులు వేయడంతో పాటు అధికారుల బదిలీల్లో ఈసీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదే అంశంపై సోమవారం జరిగిన మచిలీపట్నం రోడ్ షోలో జగన్ స్పందించారు. పేదలకు మంచి జరగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారు. పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వం ఉండకూడదని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యమన్నారు జగన్. గత ఐదేళల్లో జరిగిన మేలును గుర్తుంచుకుని.. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు జగన్.