నేడు ఢిల్లీకి జగన్.. ఖరారైన అపాయింట్ మెంట్స్

మధ్యా­హ్నం ఒంటి గంటకు ఆయన ఢిల్లీ­లోని జనపథ్‌–1 నివాసానికి చేరుకుంటారు. వైసీపీ ఎంపీలు జగన్ పర్యటనలో ఆయన వెంట ఉంటారు.

Advertisement
Update:2023-07-05 07:04 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. రెండురోజులపాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఆయనకు అపాయింట్ మెంట్ ఖరారైంది. మంగళవారం చిత్తూరు పర్యటన అనంతరం నేరుగా జగన్ ఢిల్లీ వెళ్తారని అనుకున్నా, ఆ ప్రయాణం ఈరోజుకి వాయిదా పడింది.

ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు సీఎం జగన్. 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. మధ్యా­హ్నం ఒంటి గంటకు ఆయన ఢిల్లీ­లోని జనపథ్‌–1 నివాసానికి చేరుకుంటారు. వైసీపీ ఎంపీలు జగన్ పర్యటనలో ఆయన వెంట ఉంటారు.

విభజన హామీలు.. ప్రతిపక్షాల్లో గుబులు

సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా విభజన హామీలపై ప్రత్యేకంగా వినతులు సమర్పిస్తుంటారు. పోలవరం నిధుల గురించి గుర్తు చేస్తుంటారు. ఈసారి కూడా ఇవే ప్రాధాన్యతాంశాలు అని తెలుస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రతిసారీ జగన్ పర్యటనపై కౌంటర్లిస్తుంటాయి. ఆ కౌంటర్లను పక్కనపెడితే, కేంద్రం సాయంపై ప్రకటన వస్తే మాత్రం తెగ ఇదైపోతుంటాయి వైరి వర్గాలు. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ రుణాల విషయంలో కేంద్రం ఉదారమైన ప్రకటనలు చేసింది. తాజా పర్యటనలో మోదీ, అమిత్ షాని కలవబోతున్నారు జగన్. కేంద్ర జల శక్తి మంత్రి సహా పలువురు ఇతర మంత్రును కూడా కలిసే అవకాశముంది. ఈసారి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News