తారకరత్న మృతికి సంతాపం తెలిపిన సీఎం జగన్, చంద్రబాబు, హరీశ్ రావు,పవన్
''సినీ నటుడు, ఎన్టీఆర్ మనవడు శ్రీ నందమూరి తారకరత్న మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.'' అని ఏపీ సీఎంఓ ట్విట్ చేసింది.
నందమూరి తారకరత్న మృతి పట్ల అనేక మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ మంత్రి హరీశ్ రావులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
''సినీ నటుడు, ఎన్టీఆర్ మనవడు శ్రీ నందమూరి తారకరత్న మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.'' అని ఏపీ సీఎంఓ ట్విట్ చేసింది.
''నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు.
23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.'' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. అతని ఆత్మకు శాంతి కలుగుగాక.'' అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
''నటుడు శ్రీ నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. శ్రీ తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి శ్రీ మోహనకృష్ణ గారికి, బాబాయి శ్రీ బాలకృష్ణ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.'' అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనను ట్వీట్ చేశారు.