జగన్ ఆ మాట చెబితే అధికారులు ఊరుకుంటారా..?
ఇంత ప్రాసెస్ ఉంటే, అధికారులు దాన్ని జగన్ వరకు ఎందుకు పంపిస్తారు, మధ్యలోనే పరిష్కరిస్తారు. ఇలా పరిష్కారమయితే ఇక సమస్యలెందుకుంటాయి..? ఉండకూడదు. అధికారుల్లో ఇలాంటి రెస్పాన్సిబిలిటీ వస్తుందనే సీఎం జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
"జగనన్నకు చెబుదాంలో ఎంత తక్కువ సమస్యలు వస్తే ప్రభుత్వం అంత సమర్థంగా పనిచేస్తున్నట్లు లెక్క" అని ఆ కార్యక్రమ ప్రారంభోత్సవంలో అన్నారు సీఎం జగన్. అంటే ఎన్ని తక్కువ ఫోన్ కాల్స్ వస్తే తమ ప్రభుత్వం అంత సమర్థంగా పనిచేస్తున్నట్టు అని ఆయనే చెప్పారు. మరి ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుంది అని చెప్పుకోవాలంటే తక్కువ ఫిర్యాదులొచ్చినట్టు చెప్పాలి. అది అధికారుల చేతుల్లో పనే కదా. మరి ఎక్కువ ఫిర్యాదులొస్తే ఏం చేస్తారు. అవన్నీ నిజంగానే సీఎం వరకు వెళ్తాయా..? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది.
జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి ప్రజలు కాల్ చేయాల్సి ఉంటుంది. అలా కాల్ చేస్తే నేరుగా సీఎం జగన్ దానికి ఆన్సర్ చేయరు. అసలు సమస్య ఏంటో ముందు కాల్ సెంటర్ వాళ్లు కనుక్కుంటారు, దానిని సంబంధిత విభాగానికి పంపిస్తారు. పరిష్కారం అవుతుందో లేదో కనుక్కుంటారు, ఆ తర్వాత అవసరమైతే ఉన్నతాధికారులకు చెబుతారు, ఆ తర్వాత అవసరం అనుకుంటే, దాన్ని జగన్ దాకా దీసుకెళ్తారు. ఇంత ప్రాసెస్ ఉంటే, అధికారులు దాన్ని జగన్ వరకు ఎందుకు పంపిస్తారు, మధ్యలోనే పరిష్కరిస్తారు. ఇలా పరిష్కారమయితే ఇక సమస్యలెందుకుంటాయి..? ఉండకూడదు. అధికారుల్లో ఇలాంటి రెస్పాన్సిబిలిటీ వస్తుందనే సీఎం జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఎంతో కాలంగా పరిష్కారం కాని ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసమే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీఎం జగన్ తెలిపారు. సమస్య పరిష్కారమయ్యే వరకు సీఎంఓ కార్యాలయం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. మారుమూల గ్రామాల నుంచి జిల్లా, సచివాలయం, సీఎంఓ వరకు అన్ని స్థాయిల్లో అధికారులందరినీ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ప్రజలకు సేవలు మరింత మెరుగ్గా అందుబాటులోకి రావాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు జగన్. అయితే కాల్స్ తక్కువగా వస్తే తమ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్టు అని కూడా అన్నారు. అంటే 1902కి ఎన్ని తక్కువ కాల్స్ వస్తే ప్రభుత్వ అధికారులు అంత బాగా పనిచేసినట్టు లెక్క. సో.. 1902కి తమ సమస్యలన్నిటినీ ఏకరువు పెట్టినా, వాటిల్లో జగన్ వరకు వెళ్లేవి చాలా తక్కువే ఉంటాయనేది మాత్రం వాస్తవం. రాబోయే రోజుల్లో అసలు తమ కాల్ సెంటర్ కి ఫోన్లే రావడం లేదని, అంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుందని అధికారులు చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు.